పుట:NavarasaTarangini.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజొనర్చిన సాధారణకృత్యమైన సర్వలోకవిదితమౌనుగదా! రాజు శకుంతలం గనగూడుట యేరికిం దెలియకుండు టెట్లిట్టికద యెంత యసంధర్భము! రాజొకసారిమాత్రమే శకుంతలం జతగూడె, ఇపుదు కనుటకు సిద్ధముగనాపె వచ్చె. ఆపెకుం గొడుకు పుట్టేనేని తక్కిన భార్యల కనిష్టముగా వాని న్యువరాజుగా నేర్పర్చవలసియుండును. "ఒకసారి దీనితో భ్రాంతి దీర్చుకొంటి నిక నీ యనుమానపుతట్ట మోయుటెందుకు? లోకులెవ్వరి కీసంగతి తెలియదు గాన నెద్దియు నెఱుంగునటూరకుంట మేలని రాజు తలంచుట యన్యాముకదా! కవి యిట్టికధ ప్రచురించుట లోకులకు దుర్నీతి బోధించుటకదా! వలచినంద్కు బలుపుదెబ్బ లన్నట్లయ్యె శకుంతల పని! తా జదువు కొన్న టక్కరిసానిపిల్లకదా రాజుతో నుత్తరప్రత్య్హుత్తరములు జరుపశుండునా? లేక మఱేవిధముగనైన దన గర్బము ముదురక మునుపు రజసమాచారము వెల్లడిచేయకుండునా? పోనీ రాజు తన కిచ్చిన యుంగమైన బంధువులకు జూపకుందునా? నిండుచూలాలి న్రంగస్థలమున సిగ్గుదీసి బీభత్సంబుగ నేడ్పించు టొక నాటక చమత్కారమా! దుర్వాసుని శాపమున రాజునకు మఱపు కలుగనీ.. కాశ్యపాది మహామునీశ్వర వాక్యము విశ్వసింపకుంటకు గతమేమి? రాజుమూర్ఖుడా? లేక కధకు గాల్సేతులుండవా? పెద్దలమాటలు లక్ష్యపెట్టని రాజుల గధానాయకుని జేయరాదు. 'ఓహో తాపని ముదుసలీ, " యనియు సార్వభౌముడగు దుష్యంతునివంటి క్షత్రియోత్తముడు బ్ర్రాహ్మణ స్త్రీలు మోసకత్తెలనియు నధిక్షేపించుట యుచితము కాదు. "నీపోల్కి నీపె కొడుకున్నచో నీమె నేలుకొమ్ము, లేకున్న నీపెం దండ్రియొద్దకంవచ్చు" నని పురోహితుడు చెప్పగా రాజందు కంగీకరించె. ఓహో! ఇట్టిది నీచకులుల తలం పుత్తము లిట్టి తీర్పుచేయుదురా? ఇసి భారతీయోత్తమార్య చరితమునకు గాళిదాసు డెంత తలవంపు దెచ్చె? ఉదారమగు పూరువంశ క్షత్రియకులము కాశ్యపాది మహా