పుట:NavarasaTarangini.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాస్త్రోక్తరీతిగా గాంధర్వమాడినట్లు కనబడదు. సానిపిల్ల దొంగనరము లాగున్నది . శకుంతల చెప్పినట్లు రాజు చెట్టుచాటున దాగుట యూత పోషణలో దాగి నీయిటనేల 'యంటివిరా?' యన నూక దినుచున్నానను నిటనిచందము సార్వభౌముని కేగతి పట్టెను? "సంతాపమార్చిన లతాకావలయునూ? తిరిగి నిమ బరిభోగమునకు బిల్చెద"నని యంత ప్రౌఢముగా బల్కుశక్తి యదివరకే కన్నెఱికమైన సానిపాపతుందర్క మునికన్నెయ కెట్లుండును? రాజు శకుంతల కెంతమాత్రముం దెలుపకయే తనరాజధాని నరుగుట కాముక స్నేహ స్వభావవిరుద్ధము. ఇష్ట ప్రవాసజనిత దు:ఖములు సుదుస్సహములని బ్రహ్మచారి యనుట యనుభవ విరుద్ధము. రాజు శకుంతలతో రహస్యసంభోగ మాచరించుట గౌఱకవత్సరముదనక కాశ్యపు డేఱుగన శకుంతల నిండుచూలాలైన పిదప నా సంగతి తెలిసికొని యావంతయైన దనతో జరిగిన వృత్తాంతము దెలుపని దుష్యంతుని యెద్దకు నాకాశ వాణిన్నమ్మి యాపెనంపెను. రేపో నేడో నీళ్ళాడుటకు సిద్ధముగానున్న కూతు నత్తవారింటి కెట్టికఠినుడైనను బంపునా? పురాణములో జెప్పినట్లాపెం బుత్రసహితంబుగా బంపుట కేమి యభ్యంతరమో? 'ఓ పువ్వుల మొక్కలారా! మిమ్ముల నెంతయో ప్రేమతో బెంచిన యీ శకుంతల యత్తవారింటి కేగు నాపెకు మీ సెలబొసగురీ ' యనికాశ్యపునివంటి సంయమధని పిచ్చివాని వలె చెట్లతో మాట్లాడునా? 'మలయ తటోన్మూలిత చందనలతవలె నెన్నెడసి వేఱుచో నేనెట్లుబ్రతుకగల ' శకుంతల యను నుపమానము క్రిష్టము, బండియో బట్రయో చేయరాదా? నిండుచూలాలైన కూతుం గాలినడక పంపనేల ! తనకంత ధైర్య్హమున్నచో రాజు నొద్దనుండి యరధమైన దెప్పించరాదా? కాశ్యపముని యంతమోట దనము చేయదగునా? ఒకవత్సరము లోపల దానెంతయో వలచి కలసిన త్రిలోకైకసౌందర్యవతి న్రాజు మఱచుటేట్లు?