పుట:NavarasaTarangini.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాస్త్రములును దన పాండిత్యము జూపుకొఱకు గొంత గ్రంధరచన గావించినట్లు ప్రసిద్దింజెందెను.

   షేక్స్పియరొనర్చిన "ల్యూక్రశేనీఛేఱ" (Rape of Lucrece) యను కావ్యమందలి కవితాశాక్తి గొనియాడ వేనోళ్ళు చాలవు. దేవుడంతట వ్యాపించినట్లు షేక్స్పియరువిజ్ఞాన మఖిలమానుషానుభవనముం బొందెను. షేక్స్పియరు కనిపట్టని మనుష్యానుభవము లేదు. సకల మానుషసంఘము న్శోధించి శోధించి తచ్చేష్టతముల న్లోకులకు దేటతెల్లముగ వెల్లడించెను.  కాళిదాసుని కవిత్వమందు బూర్వులు త్రొక్కని క్రొత్తమార్గ మెద్దియు లేదు. కొంతవఱకు జయదేవభవభూత్యాదులు నవీన భారతీయ కవులలో స్వతంత్రులుగా గాన్పించిరి. షేక్స్పియరుడు స్పెన్సరుని కవిత్వము నెంతయో కొనియాడుటవల్ల షేక్స్పియరుని కంటెగూడ నెక్కుడు కవులుండియుందురనుటకు సందియములేదు. భారతీయ నాటకములలో మృచ్చకటికా, వేణీసంహారములు మిక్కిలి రమ్యములు.

రూపక ప్రయోజనము:

     క్రతువిధానములు శ్రాద్ధములు, వివాహములుత్సవ విగ్రహము లూరేగించు సంబరము, లేకాంతసేవ, ససిరమ్మ నాటకములు, పగటి వేషములు, భాగవతములు బొమ్మలాటలు మొదలగునవి జనుల కాస్తిక్యబుద్ధియు నేర్కయు గలిగించుటకై వైదికస్మార్తలౌకికధర్మములు దనాదిగ నాటకరూపములుగ నున్నవి. నటులకు సభ్యులకుంగూడ సంకల్ప వశమున రసములు పుట్టించునది నాటకము. క్రమక్రమముగ నాగరికత ముదిరినకొలది రూపకవిశేషములు తలమానందొడంగె, సహజముం గనుగొనుటకన్న గృత్రిమముం జూచుటకు మిగుల వేడ్కపడుట పామరజనస్వభావము. మఱియు నూర కగపడు శుక్కంగడు నరయుడు గాని నదిరూకలకైన గుక్కప్రతిమం గొని యింటనుంచుకొని యవివేకి యబ్బురపడుచుండును. దేవు డూహాపోహలు