ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కొడుకని విశ్వసించి విరహవ్రతధారిణియగు నాపె న్శకుంతలగాబోల్చి కలిసి యున్నట్టు పురాణకధకు విరుద్ధముగ లేనిపోని యసంభవముల గూర్చిన యది యొకనాటకమట! నాటకాంతం కవిత్వమంట! ఏమీ చోద్యమేమీ నాటకంపుబిచ్చి! వాల్మీక వ్యాసాది కవుల కీనాటకమువిరచన నోన్మాద మేల పుట్టలేదో! కవిసార్వభౌములగు భారవిమాఘలు, నన్నయభట్లు, తిక్కన, పోతన, పెద్దనాదులు, స్పెన్సరు, మిల్టన్ ప్రముఖులు నాటక విరచన మనంభావ్యమని జుల్కనిపనియనియు మానివేసి యుందురు.
హేమ్లెట్ - శాకుంతలము
గద్యముకన్న బద్యము రచించుట కష్టము. పద్యముకన్న పాట యొనర్చుట కష్టము. నాటకవిరచన మధుమ మైననేమి, యుత్తమ మైననేమి? దాని లోపాలోపములతో బనియేమి? కడచినదానికి వగపేల? లోకైక కవులు నాబరంగిన షేక్సిప్యర్కాళిదాసుల కృతులలో విచారించినతో షేక్సిపియరుని హేమ్లెట్టును, గాళిదాసు శకుంతలమును నిరుపమాన ప్రఖ్యాతిం గాంచినందున వానిగూర్చి కొంత చర్చింపవలసియున్నది. హేమ్లెట్టు - "డెన్మార్కు దేశమంతటి లోను వానికంటె దుర్మార్గుడు లేదు హొరేష్యో! యీ సంగతి చెప్పు టకు సమాధినుండి యా ప్రభువు దయ్యమే లేచినా నక్కర లేదు" అని యనుటబట్టి యదివఱకే రాజు బలాత్కారముగా నతని తమ్ము నిచే జంపబడినట్లందఱికి దెలిసియుంట స్పష్టము. మఱియు హేమ్లెట్టు కావలసి వెఱ్ఱివానివలె గన్పట్టేదనని తనచెలికాండ్రతో జెప్పి యున్నాడు. తన తండ్రితో నోఫీలా తన నడుము హేమ్లెట్టు పట్టుకొని యెంతయో ప్రేమ జూపించి యెట్టకేలకు దనయందలి మోహము విదల్చుకొన్నట్లు కాన్పించెనని చెపుటవలన హేమ్లేట్టు నకు దనతల్లి యు బినతండ్రియు నొనర్చిన దౌర్జన్యముంబట్టి సంసార భోగములందు గాడవిరక్తి కలిగె. ఉత్తముండగు తనతండ్రిం జంపి