పుట:NavarasaTarangini.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తనతల్లిం బెండ్లాడి రాజ్య మాక్రమించుకొన్నతనపినతండ్రిం బోలయించి పగదీర్చుకొనుటయే తన బ్రతుకునకు సార్ధకమని నిశ్చయించి వెఱ్ఱివానివలె నటించుచు నదును వేచుకొని యుండెను. హేమ్లెట్టు తల్లికి మఱియాపె క్రొత్తపెన్మిటికిని హేమ్లెట్టు వెఱ్రివేషంబునస దమ దుర్నయమే కారణమని నిశ్చయముగా దెలియును. హేమ్లెట్టా తెన్సు టైమనువలె మానుషసంఘముపై నసహ్యపడేను. లోకము నుద్దరింప గోరిన బుద్ధుడు భార్యను, రాజ్యబోగముం దృణప్రాయముగ బరిత్యజించినట్లు హేమ్లెట్టు తాబిట్టు వలచిన యొఫీలాను, మఱియు దనజీవితేచ్చం గూడ బాపాత్ముడగు తన పినతండ్రి జంపి తనతండ్రి ఋణముతీర్చుట కెంచివిడనాడెను. హేమ్లెట్టు ధర్మాత్ముడు, మఱియు, విచక్షణుడు . హేమ్లెట్టుయొక్క పినతండ్రి ప్రతిక్షణము తన్ తప్పునకై పశ్చాత్తాపమందుచుండియైన స్వభావముగ దుష్టౌటచే నాత్మరక్షణకై హెమ్లెట్టుం బోలియింప నిశ్చయించెను. సుగుణ సౌందర్య బలములం బరిపూర్ణుడగు తనతండ్రి న్విడిచి దుర్గుణభూయిష్టుడు ను గురూపియు నగు తన పినతండ్రిం దనతల్లి మరిగి తనతండ్రిం జంపుట హేమ్లెట్టునకు బ్రతుకునందు రోత బుట్టించెను. తనతల్లితో బోలినన్సునకు గూడ గూడని సంబంధముంట శంకించియే కాబోలు హేమ్లెట్టు తన తల్లి గదిచెంత నర్ధరాత్రమున నొంటిగ డాగిన పోలినన్సు నెఱుగనట్లు పొడిచి చంపెను. హేమ్లెట్టు లోకులందఱిచే మిక్కిలి ప్రేమింఫబడెగాన నతనికి బాహాటముగా హానిచేయుట కాతని పినతండ్రి వెఱచెను. పశ్చాత్తాపదశయందు దైవప్రార్ధనము చేయుచున్న పరమ దుర్మార్గుడు చంపబడి సద్గతినొందుట కిష్టపడకుండుటచే ధర్మజ్ఞాడైన హేమ్లెట్టు దైవమునకు మ్రొక్కుచున్న పినతండ్రి రాత్రి యెంటిగ దనకు దొరికినప్పటికి జంపకుండెను. మఱియు నోఫీలా తావలచి నలపించుకొనిన హేమ్లెట్టుం బొలియించుటకై యాతని పినతండ్రి యింగ్లాండునకు బంపుట విని నిరాశచెంది పిచ్చెత్తిపోయె