పుట:NavarasaTarangini.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొనర్చుననియా? నాటకవిరచనములు చెట్టుచచ్చెడుకాలము నకు గుక్కమూతిపెందె అనదగునేమో! ప్రసూతాస్తము యౌవనమున వయసు చెడుటకుగుర్తు కాన్పురాదా? సహజమగు చంద్రబింబముం జూసి యానందించక చిత్రపటమున నద్దాని ప్రతిజూచి యలరు వెఱ్ఱి వలె గొమ్మ నుపేక్షించి కొయ్యబొమ్మ న్వలచు వెంగలిమాడ్కి, మఱియు బ్రత్యక్షమగు పాలు మాని మనసులోని బాల్ద్రావు వెడగు తెన్నున దా బరికించు యధార్ధవస్తువుల వాస్తవంబున కానందింపక వాలకంబుల కుల్లాసపడువా డెంతవెఱ్ఱివాడో! ఇప్పటి లోకులసంగతి తెలిసికొనుటకు మోచేతికంకణమున కద్దమట్లు నాటకము చూడ నక్కఱలేదు. పూర్వులస్థితి తెలిసికొనుటకు నాటకముల కన్న గవికృతేతర గద్యాద్యకావ్యములే లెస్స. ఒకరివేన మొకరూనినచో నపహాసస్పదమగుగాని స్వాభావికముగ నుండునా? కావున నాటక ప్రయోగమున బ్రయోజనములేదు. పూర్ణ గర్భవతియైన తనమాట మఱచి తన్నునిరసించుభర్తయెదుట శకుంతల పడిన పాట్లొక పదాఱేండ్ల కుఱ్ఱవా డాపెవేషము పూని తెలుపదొరకొనుటయు నందుకు జనులలరుటయు వెఱ్ఱికుదిరినది రోకలి తేరా తలకు జుట్టుకొనియెద నన్నట్లుండదా? అట్టి వాలకంబులవలన వెఱ్ఱులను చప్ప జ్ఞానులకు హృదయంబుల రసముప్పతిలునా? తనతల్లిన్మరిగి తన తండ్రికి వినమిడి చంపించిన తనపినతండ్రి యెదుటనున్నప్డు హెమ్లెట్ యొక్క ముఖవైఖరి యెట్లుండునో మన యూహకే యందనప్డు వేషముచే దెలుపబడుటేట్లు? కధాసందర్బము తెలుపుటయందు నాటకము ద్రావిదప్రాణాయామమువంటిది. ఒకవత్సరము క్రిందట దాగలసిన త్రిలోకైకసుందరి యగు శకుంతల న్మఱచి యాఫే యెన్ని గుర్తులు చెప్పినను నమ్మక సభాస్థలి నాపెందూలనాడి పొమ్మనిన దుష్యంతుడాపె యేగిన వెంటనే యాపెను దానొసంగిన యుంగ్ర మొకజాలరియొద్ద దొరినంతమత్రముచే నాపెం దాగూడినట్లు జ్ఞప్తికి దెచ్చికొనుటయు మఱియైదేండ్ల కాపె కొడుకునుజూచి తన