పుట:NavarasaTarangini.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింగారమునకు దగని కఠిన సంస్కృత దీర్ఘసమాసములు దెలుగు పద్దెము ల్గడముట్టింపరారు. ఇపు డఱసున్నకు పల్కుబడిలేదు. తెనుంగున నఱసున్నలు న్శకల రేఫములుగలపదముల దెలిసికొనుట దుస్సాధము. కాని కొన్నికొన్ని ప్రయోజనములంబట్టి పూర్వమతానుసారంబులుగ నీగ్రంధమున నఱచున్నలును శకటరేఫములు, దంత్యచజలకు బీఠిక మొదటి పదిపుటలయందు న్నట్లు గుర్తులు దెలుపబడియెను. మిగిలిన బుద్దిమంతుడు నోటి బిరడదీసి చెర్వులోని చేపలు చెట్లెక్కి పోయెనన్నట్లిప్పుడొక పండిత మ్మన్యుడు కొండకుగొణ్డ - యెందు కెన్గుకు - నంపుట కమ్సుట - మంచికిముడ్చు - యింక కిస్కయనియుం దెలుగువ్రాతల జంపుచున్నా డాహ యేమీ పిదపకాలము! తెనుగున లేని బదాలు తద్దినము కొనునట్లు తగిలించుకొని గోరంజీఱునది గొడ్డటంజీల్చు నట్లు సులభముగా సున్నతో వ్రాయగలిగిన దానికి జ ఞ్,మ్ ణ్ న్ లం బోధించు వృధాప్రయాసమునకు లేఖకులకు గావింప దగదు.

రూపకనిరాసము

  షేక్స్పియర్కాళిదాసు లోని సొగసులు శృంగారాది నవరసంబులు నీగ్రంధమున బోల్చబడియె. కావ్యంబులు గీతగోవిందము వంటి గీతప్రబంధముత్తమము. మాఘామువంటి కేవలాద్యకావ్యము మధ్యమము. శాకుంటలమువంటి గద్యపద్యమిశ్రరూపక మధుమము. మొదటిది సంగీతసాహిత్యవిద్యావేత్తల కానందదాయకము. రెండవది కేవల భాషాపండితైకవేద్యము. మూడవది పండితపామరోభయ నేత్రశ్రోత్ర మాత్రరంజకము. మొదటిదాని న్రచించుటకు వాగ్గేయకారుడే తగును. రెండవదానికి గేవల భాషాపండితుడు చాలును. మూడవది పలువుర వాలకములతో గాని యక్కఱకురాదు., నాటకాంతం కవిత్వ మనుదానికి నాటక రచనమే యుత్తమకవిత్వ మని యభీప్రాయమా లేక కవికి కావ్యరచనా శక్తితగ్గినపుడు నాటకాంతం, కవిత్వ మనుదానికి నాటక రచనమే యుత్తమ కవిత్వమని యభీప్రాయమూ లేక కవికి కావ్యరచనా శక్తితగ్గినపుడు నాటకరచన