పుట:NavarasaTarangini.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతీయ గ్రంధములలోని యూహలన్నియు గలిపినచో షేక్స్పియరుని యూహలగునేమో! ఎన్ని మహానదులు కలసిపాఱి నను సముద్రమున కొకమూలకు వచ్చునా? సూర్యవంశ పాలనస్థితి సూర్యకాంతి, గీర్వాణభాషా గౌరవము, భరతవర్షాచారసౌకర్యము, షేక్స్పియరుని కవితాప్రతిభయు నిరూపమానములు. పూర్వులలో వాల్మీకి వ్యాసులు, నవీనులలో జయదేవమాఘభవభూత్యాదులు గాళిదాసునకు సమానులో లేకధికులోగాని లోకమునందలి కవులలో షేక్స్పియరునకు సమానుడుగాని యధికుండుగాని లేడనవచ్చును. నామట్టుకునాకు గాళిదాసుం జదువునపుడు షేక్స్పియరు - నగరుననున్నప్పుడు పట్టణమువలె స్ఫురించెను. షేక్స్పియరుని జదువునపుడు కాళిదాసుడు మహారణ్యమున్బరి శీలించునెడ నుద్యానవనమువలె దోచెను.

అనువాద భాష

   మఱియు నీ గ్రంధమున నాయుపయోగించిన భాషయుం బద్య లక్షణముం బూర్వకవిమతానుసారము. కాళిదాససంస్కృత మచ్చ తెనుగున దెల్పినాడ. గీర్వాణభాషం దెనుగునకు మార్చునపుడు "గమికర్మీకృతనైకనీవృతండనై" యని యాంధ్రీకరించిన లాభమేమి? ఆంగ్లేయభాష నాంధ్రమొనర్చునెడ నాంగ్లేయభాషాపదముల వాడు టేట్లు తగదో దేవభాషం దెలిగించునపుడు తత్సమ మట్టుపయోగింప రాదు. మిశ్రకావ్యములం గూడా గొండొక యర్ధముం దెలుప నచ్చ తెలుగునకు శక్తిచాలనప్పుడు మాత్రమే వాడుకలోనున్న తత్సమ ముపయోగింపవచ్చును.

"పడి గోరువెచ్చ గుబ్బల గ్రమ్ముకౌగిలి,
      గట్టిగ మొదలుంటబట్టు మోని"--అని చెప్పక
"సహసా నఖంపచ స్తనదత్త పరిరంభ,
      మామూల పరిపీడుతాధరోష్టి" మని