షేక్స్పియరుడు సహపండితుడు, స్వతంత్రకల్పనాచతురుడు, పరుల కట్టుపాట్లకు లొంగక యధేచ్చగా గావ్యంబులొనర్చెను. మఱియు బెక్కుశబ్దంబులకు నిజేచ్చానుసారార్ధంబు వినియోగించెను. కాళిదాసుడు ప్రాచీననిబంధనములకు లోబడి కృతులొనర్చె అందు నాకు లభించిన కావ్యములు:1.రఘువంశము 2.కుమారసంభవము 3.మేఘసందేశము 4.ఋతుసంహారము 5.శృంగారతిలకము 6.పుష్పభాణవిలాసము 7.నలోదయము 8.రాక్షసకావ్యము. నాటకములు: 1.విక్రమోర్వశీయము 2.శాకుంతలము 3.మాలవికాగ్నిమిత్రము 4.ప్రహసనము షేక్స్పియరొనర్చిన 37 నాటకంబులలో గొన్ని* యతనిని కావను కొనెదనుగాని నిశ్చయము చెప్పరాదు. వివిధవేషంబుల నొక్కడే నొక్కడే వివిదావస్థలు దోచునటులొకని సరస్వతి పెక్కు తెఱుంగుల గాన్పించుటకూడ నైజమనవచ్చును. రఘువంశమున నవసానవర్గములు, కుమారసంభవములోని పదవసర్గ మొదలు కడమసర్గలును, మాలవికాగ్నిమిత్రము, నలోదయము, ఋతుసంహారము, శృంగారతిలకము,పుష్పబాణవిలాసము, రాక్షసకావ్యములు, ప్రహసనము కాళిదాసు కృతులగునా యేమో దేవునకెఱుక, కఠినముగా జెప్పలేదన - నలోదయ రాక్షసకావ్య ములు, శ్వభావోక్తి చాలదన - ఋతుసంహార మాలవికాగ్ని మిత్ర శృంగారతిలక పుష్పబాణ విలాపములు, మోటహాస్యము కనుపడదన ప్రహసనంబు నెడమచేతి వ్రాతవలె రఘువంశ కుమారసంభవావసాన సర్గలు ప్రచించెనేమో! కాళిదాసుకు షేక్స్పియరునివలె స్వతంత్రుడుకాడతని కవిత్వ ము వాల్మీకి వ్యాసకవిత్వముల ననుసరించినది.
- Comedy of Errors, Macbeth Love's Labour Lost, Merry wives of windsor, Midsummer Night's Dream, Much Ado About Nothing, Othello, Taming of the Shrew, Titus and Andronicus- Troilus and Cressida, Winter's Tale.