Jump to content

పుట:NavarasaTarangini.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగింపరాదు. రూపకాభినయప్రయోజనము సభ్యుల నుల్లాస పర్చి నీతినేర్పుటగాని జుగుప్సాభయశోకముల గల్గుజేసి కర్తవ్య మెఱింగించుట కాదు. కుళ్ళుపుండునుండి కులకులరాలు పురుగులు వంతులు విరేచనములు చేసికొనుచు గడునీరసిలి చావసిధ్దముగనున్న మనుష్యుల నొకవైపు పొడిచి పీకి తిను రాబందుముక్కుల వ్రేలాడు ప్రేవులు, పూర్ణ గర్భవతులం బొడిచి చుట్టబందువు లేడ్వం గడుపులోని శిశువులం బైకిలాగి కాలంద్రొక్కుచు బగదీర్చుకొను రౌద్రకారులక్రూరచేష్టితములు జూడవేడ్కంబదు నాచూపులు నవరత్నస్థగిత సింహాసనమున సకలజనసమ్మతి నధిష్టించు చక్రవర్తులు బరస్పరవదనాన లోకస కుతూహలంబుతో నానందంబు మూర్తీభవించునట్లు పెండ్లిపీట నలంకరించిన నవవధూవరులు, దేశోపద్రకారులగు దుష్ట శత్రువుల నిర్జించి పాఱ దఱిమి సకలజనరక్షకులై జయభేరి మ్రోయ నిజవిలయంబుల కేతెంచు వీరమూర్ధవుల నాలోకింప నాశించునా? తనతల్లి పినతండ్రింబొడిచి పగదీర్చు కొని తన్నుంబొడుచుకొని చచ్చుట, ముదురువిటుకులాడిం బెండ్లాడి యాపె తనయెడల విటకానితో జేయు దుశ్చేష్టితులు కనిపెట్టియు నొక మహారాజేమియు ననజాలక నోర్మూసికొని, తుదకాపె తన కొడుకులచే యువరాజుని జంపించి యాపెకాల్రేతుల న్మఱియ నాల్కన్ ఖండింపించుట మొదలగు తనదుష్కృత్యముల బహిరంగముగా నొప్పుకొని నరునిచే బొడవంబడ జూచుట, తలిదండ్రులన్నదమ్ములు మొదలగు సన్నిహితుబంధువుల న్రాజ్యాభిలాషచే నెన్నియో కుట్రలం బన్ని బందెలిడి చంపుచు బసిబాలుర హతమొనర్చుచు భర్తలకృత్యము లాచరించుచు దుద కొకదుష్టరాజు యుద్ధమున గూలుట మొదలగు నసమంజస కధావిధానములు రంగస్థలమున నభినయించుట కొంత నీతిబోధకమయ్యు సభాసదులకు హృదయక్షోభకరం