పుట:NavarasaTarangini.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బని యెంచియే భరతమునుప్రముఖ నాట్యవేదములు శృంగారవీర రస ప్రధానములుగా నాటకములుగా నాటకము లుందవలయుననియు, సుఖపర్యవసానయుతములు కావలయుననియు శాసించిరి.

షేక్సిపియరు విశిష్టత

   భారతీయాలంకారికు లేర్పర్చిన దోషములు పెక్కులున్నప్పటికిని షెక్సిపియరుని కృతులు లోకోత్తరములనుటకే సందియమునులేదు. షేక్సిపియరుని వంటి కవిశిఖామణి నభూతో నభవిష్యతి యనదగినది. షేక్సీపియరు ని కవిత్వముతో నన్యుని కవితంబోల్చుట సూర్యునితో గరదీపిక సరిచేయుటవంటి దను విచక్షణులు సనడ్డచేయరాదు. తన కావ్యదర్పణంబున జగమునెల్ల జూపిన మహానుభావుండు భారతీయులలో వ్యాసుడు, నాంగ్లేయులలో షేక్సిపియరని నా యభిప్రాయము. భారతం చదివినప్పుడు, షేక్సిపియరుని కృతులన్నియుం బరికించినపుడును నామనసునకు లోకమంతయు నొకేపోల్కి స్ఫురించెను.
  కావ్యంబులయెడ నెవరి కట్టుబాట్లు వారివి. ప్రాచీన కావ్య పద్దతి పాశ్చాత్యులకు లేకుండుట యొక కొఱంత యనరాదు, కవితాప్రతిభం బరికించుట ముఖ్యముగాని వారి నియమములు వీరికి లేవని యేవగింపరాదు. సహాయసంపదతో గార్యము నెరవేర్చినవానికన్న నసహాయుడై నెగ్గినవాడు స్తవనీయుండుగదా! శాస్త్రము చదివి సుసిక్షితుడై సొగసుగ నిల్లుకట్టిన మానవశిల్పి చాతుర్యముకన్న సహనపాండిత్యంబున రమ్యమగు దన గూడల్లుకొనిన బంగరుపిచ్చుక నేర్పు శ్లాఘ్య్లము, సకల భాషాజనని యగు దేవభాషలొ గావ్యము జెప్పి లోకుల మెప్పించినవానికన్న దేశభాషలో గబ్బమొనర్చిజగము స్సంతోషపెట్టువాడు వేయిరెట్లెక్కు డనదగు.

తారతమ్యము

   కాళిదసకృతు లాంగ్లేయభాషకును, షేక్సిపియరుని కావ్య్హంబులు గీర్వాణభాషకును మార్చినయెడ నా యిరువుర తారతమ్యము