పుట:NavarasaTarangini.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లగుచున్నారు. జాతిసాంకర్యము, నాస్తికత, గ్రామ్యభాష మొదలగు పెడత్రోవలు స్వబావసిద్ధంగా లోకములోనే యున్నవి. యొకరు క్రొత్తగానేర్పనక్కఱలేదు.

ప్రాక్పశ్చిమకావ్యమర్యాదలు

  సంస్కృతమునగల కావ్యనిబంధనము లాంగ్లేయభాష కంతగా గానరావు. నాయికానాయక లక్షణము భారతీయకృతులందు వలె బాశ్చాత్త్య కావ్యముల గాన్పించదు. మఱియు నశ్లీలాది కావ్యదోషంబులం దనకబ్బములం గణింపకుంట షేక్సిపియరుని దోషముకాదు. క్రొత్తగా నాగరకతం బొందుచున్న యాంగ్లేయ భాష కనాదినాగరికతగల భారతీయవాగ్గౌరవ మంతగా లభించకుంట వింతకాదు. కావ్యంబున బిఱుదనుటకు బిఱ్ఱయని ప్రయోగింప జెవి కేవకాదా? స్వభావవర్ణన మనుచితంగా చేయరాదు. ముగురులు వాల్చూపులు ముత్తెంబల్వరున చిఱునగవు తళుకుంజెక్కులుగల మోము న్నిండ్చందురునితో బోల్చి వర్ణించునట్లు దిసమొల నద్దాని విశేషంబులతో వర్ణించుట సభ్యమగునా? మోముంగన్బర్చినట్లు దోభాగము నగపర్చందగునా? శృంగారమున - స్త్రీపురుషు లొండొరులం గ్రొచ్చి కౌగిలించుకొని దశ్విధచుంబనము లొనర్చుచు గుహ్యభాషితంబులనుచు గామకేళిం గావించుట; హాస్యంబున - గొప్యావయనంబు లగపర్చుచు మోటమాటలు పల్కుట; రౌద్రంబున - నవయవంబులనఱకుచు బ్రేవులం బెఱకుచునతికఠోరముగ భాషించుట, భీభత్సంబున-నెత్తురువరదలు ప్రేవులప్రోవులు చొంగ మొదలగు నసహ్యముల గన్బర్చుట, కరుణయందు-బలువురుగలసి యొక్క పెట్టున గోలుమని యేడ్చుట, శ్మశానక్రియలు మొదలగు ఘోరముల జూపుట; భయానకంబున-మూత్రపురీషోత్సర్జనాభీనయమును నాట్యరంగమున బ్రదర్శనార్హ  మెంతమాత్రముంగాదు. జుగుప్సాభయ శోకముతో సభాసదుల కాధివ్యాధులు కలుగునట్లు నాటకములు