పుట:NavarasaTarangini.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనకమని ప్రయొగార్హశబ్దంబులు పరిమితముగా గ్రంధమునకు నియమింపబడియ. గణయతిప్రాసములు నుపమాద్యాలంకారములు జమత్కృతింబుట్టించుచు దృఢధారణము నకు సాహాయ్యముగా నేర్పర్పబడియె. ప్రాసమో విశ్రమవర్ణ నియమమో లేని తెలుగుసామెతయే కానరాదు. కావున దెలుగు బాసకు మార్ధమువలె తెలుగుపద్యములకు యతిప్రాసమ్లు వర్ణధర్మములు, వావివరుసలతీరున నలంఘ్యములుగా గన్పట్టెడు కార్యముతోనే ప్రయోజనముగాని కట్టుపాటు లవసరము లేదన్నచో జాతినీతులు, వావివరుసలు, తలమొలల కుదుపులు, భక్ష్యాభక్ష్య వివేకము, పిన్నపెద్ద తారతమ్యము, పాపభీతి, యాస్తిక్యము మొదలగు వానితో బనిలేదనవచ్చునా? మనయూహలకందని పుణ్యవిశేషమెద్దియో లోకోపకారార్దమన్నికట్టుబాట్లయందు బూర్వుల చే నుద్దేశింపబడియెను. బాల్యయవన వార్దక దశలందు నరు డవస్థా భేదమున నెల్లగతుల మారుచుండియు దా మాఱనట్లాచారములు న్బాషలు కాలానుసారంగా బ్రవాహందకముగ గీతి మాఱుచుండియు మాఱకుంట చిత్రము భారతమునాటి తెలుంగిప్పటి గ్రంధములందు మాఱుచుండినను మాఱకాకట్టుబాట్లనే యనుసరించి యుండలేదా? నవనాగరకతు లన్నిటన్జేయదలంచు మార్పులెల్ల గావ్యదోషరూపముగా మఱియు గ్రామ్య భాషాకారముగా నదివఱకున్నవే, వారి మార్పుకోర్కె వ్యర్ధము. గానమునగు శ్రుతిలయ లక్కరలేదనియు, భాషకు వ్యాకరణమొందుకనియు; బద్యముల గణయతిప్రాసనియమ మవసరము లేదనియు బాడికాని లేక కావ్యముల రచించికాని సార్వలౌకికులు కానేరక గాన కవితలన్గూర్చి తెలిసీతెలియని యభి ప్రాయములిచ్చు సంగీతకారులు గవితాభ్రాతలుం గ్రహచారంబున రాజభాషాపండితు లనిపించుకొని యున్నతపదవులందిన మాత్రందమకన్నియుం దెలియునని దురభిమానంబునం బండితమ్మన్యులై విపరీత బుద్ధి న్నవనాగరకాగ్రగణ్యులుగా బ్రభు సన్మానము వడయగోరి గాన కవితావిద్యలకు స్సదాచారములకు న్వేరువిత్తు