పుట:Navanadhacharitra.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

43

లీలఁ గైకొని మంచి ◆ లేవింటినారిఁ
జెలువార నెక్కించి ◆ చెంగల్వమొగ్గ
ములికినారస మేర్చి ◆ [1]ముంచి(నతే)నె
పరగించి యాలీడ ◆ పాదస్థుఁ డగుచుఁ
దిరముగా సంధించి ◆ తెగనిండఁదీసి
గురుకుచమధ్యంబు ◆ గుఱిచేసి లాఁచి
సరిగోలఁ బడసేసి ◆ చలముననార్చె
నప్పుడు పూఁబోడి ◆ యంతరంగమునఁ
గప్పిన కామవి ◆ కారంబు కతన
మానంబు పేటెత్తి ◆ మర్మంబు గదలి
మేనెల్లఁ బులకించి ◆ మెచ్చులు వొదలి
తమకంబు నంతంత ◆ దట్టమై నిగుడ
గమకించి యందెలు ◆ ఘల్లుఘల్లనఁగ
మొలనూలురంతుగా ◆ మ్రోయ మాణిక్య
కలితకంకణఝణ ◆ త్కారంబు లెసఁగ
నొసపరి బాగుగా ◆ నొదవిననడల
దుసికిలఁబాఱి సం ◆ ధులనాభిదోఁప
దిన్నని నూఁగారు ◆ తీగె చూపట్టి
యన్నువ నెన్నడు ◆ మందంద వణఁక
గొబ్బునఁ బయ్యెద ◆ కొంగు దొలంగ
గుబ్బచన్నులమించు ◆ గురువులు దాఁటి
[2]తరళహారంబుల ◆ తళుకులు చెదర
నెరయు వెన్నెల గాయు ◆ నెఱినవ్వు దోఁప
ఘనరత్నతాటంక ◆ కాంతులు వెలయఁ
గనుఁదోయిమెఱఁగు ద్రొ ◆ క్కని చోట్లఁ ద్రొక్క
ముద్దుఁగ్రుమ్ముడి వీడి ◆ మొనగోర లీల
దిద్దిన కస్తూరి ◆ తిలకంబు గరఁగ
సీమంత మౌక్తిక ◆ శ్రేణి నెమ్మోము
తామరపువ్వుపైఁ ◆ దకతకలాడఁ
గురులు తూఁగంగను ◆ గ్రొన్నెలసోగ
మరువంపురెమ్మ మ ◆ న్మథుకరవాలు
చిత్తరురూపును ◆ చెంగల్వ[3]జోక

  1. ముంచి... .... నెపదనిచ్చి.
  2. తార... నెరసి... లేనవ్వు
  3. జోకైనచెంగల్వ