పుట:Navanadhacharitra.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

నవనాథచరిత్ర

వెడమతిఁ దనపాలి ◆ విధిఁద్రిప్పఁబోవఁ
జక్కని వారిలోఁ ◆ జక్కనివాని
..... ..... ..... ..... ..... ..... ..... ..... ......
నిగనిగమనుజాతి ◆ నీలాలరంగు
[1]నిగుడు వక్రత గల ◆ నెఱివేణివానిఁ
గలువలచెలికాని ◆ కలకలనవ్వు
కళగలయ[2]టిముఖ ◆ కమలంబువానిఁ
దెలిదమ్మిరేకుల ◆ తెలివినొందించి
తలచుట్టి పాఱునే ◆ త్రంబులవానిఁ
బసిఁడి మించిన మంచి ◆ పసిఁడియు వన్నె
కొసరించుమైచాయఁ ◆ గొమరారువాని
చిన్నెలు వాఱఁ దీ ◆ ర్చినపట్టుకాసె
సన్నపుకటిమీఁదఁ ◆ జెన్నొందు వానిఁ
జరణపద్మంబుల ◆ ఝంకించిమ్రోయ
బిరుదునూపురమునఁ ◆ బెంపొందువానిఁ
జిలుకఱెక్కలకొత్తి ◆ జిగి దువాళించు
నలరారుపచ్చల ◆ హారంబువానిఁ
గడునొప్పు పద్మరా ◆ గముల పతకము
వెడదయురంబున ◆ విలసిల్లువానిఁ
గళకులవజ్రాల ◆ కమ్మగెంటీల
తళుకుల చెక్కుల ◆ తళుకులవానిఁ
బలుచనిపన్నీటి ◆ పదనిచ్చి మెదిచి
తిలకంబు కస్తూరిఁ ◆ దీర్చినవాని
శృంగారమలవడ ◆ చెలువొంద మంచి
చెంగల్వపువ్వులు ◆ చేర్చినవాని
ఠీవిగా జిగి ముర ◆ డింపంగమయిని
గోవజవ్వాజిని ◆ గుడ్చినవాని
భువన సమ్మోహనం ◆ బుగ నుదయించఁ
దివురుయౌవనలక్ష్మి ◆ దిలకించువాని
సారంగధరు రూప ◆ [3]సంపన్నుఁగన్ను
లారంగ ఱెప్పల ◆ ల్లార్పక చూచె
నాలోన భావజుం ◆ డలరులవిల్లు

  1. నిగనిగమని.......... నిగిడివాతెర
  2. యట్టి
  3. సంపదగన్ను