పుట:Navanadhacharitra.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

నవనాథచరిత్ర

వంశపావనులగు ◆ వారు ముక్తికిని
హంసమండల మెదు ◆ రై చనంజేయు
హంసగుండముచూచి ◆ యాజలం బాని
యచ్చోట ననురక్తి ◆ నాదినంబుండి
చెచ్చెర మఱునాడు ◆ సితధామధామ
[1]తారాద్రితారక ◆ తార మరాళ
[2]సారసఘనసార ◆ సార సారంగ
ధర దరహాస చం ◆ దన[3]కుంద బృంద
హర హరిద్విప సుధా ◆ హార గోక్షీర
విశదప్రభావళి ◆ విన్నున సకల
దిశలెసఁగఁగ గప్పి ◆ తెట్టుకొనంగ
వెలుఁగొందు నవరత్న ◆ విమల శృంగముల
మెలఁగాడు కస్తూరి ◆ మృగములగముల
చలివెలుగులు వెద ◆ చల్లు నెత్తములఁ
జెలఁగాడు నప్పర ◆ స్త్రీలమొత్తములఁ
దరుణప్రవాళ[4]ల ◆ తాంకూరములను
విరిసియేప్రొద్దును ◆ నెలయు కంజములఁ
గొమరారు నెత్తమ్మి ◆ కొలఁకులదరుల
రమణఁజరించు మ ◆ రాళబృందములఁ
గమనీయముగఁ జంధ్ర ◆ కాంతంపుఁజరులఁ
బ్రమదంబునిండారఁ ◆ బాడుకిన్నరుల
ఘనరవంబుకు మాఱు ◆ గర్జించుహరుల
ననిశంబుఁ జరులఁ ◆ గోరాడెడి కరులఁ
దిరముగా నీడలు ◆ తిరుగని తరుల
సరితపంబులు సల్పు ◆ సన్ముని వరులఁ
జెలులను దాఁగూడి ◆ చెలఁగు నిర్జరుల
జలువిడి చరులపైఁ ◆ బారు వానరుల
దివ్యౌషధములను ◆ దివ్య వృక్షముల
దివ్య విహగముల ◆ దివ్య ధేనువులఁ
బరుసవేదుల బలు ◆ పారు మందార
తరుణ కదంబ చిం ◆ తామణీ తతుల

  1. తారాతిరాభిసోద్దారమందార.
  2. సారసారస ఘనసారసాపూర, ధర.
  3. దనకురంగదబృంద
  4. తాతోరాం కుజముల.