పుట:Navanadhacharitra.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

205

జౌక సేయక క్రుంకి ◆ సమ్మదంబెసఁగ
నద్దినంబెల్లఁ దా ◆ రటవసియించి
ప్రొద్దున మఱునాఁడు ◆ పోయి యచ్చోట
భువనేశ్వరునిభక్తిఁ ◆ బొడగాంచినాఁటి
దివస మచ్చట సుఖ ◆ స్థితినుండి కదలి
వరలుభూరుహకోట ◆ వైశ్వానరంబు
[1]నెరయుపాశుపతంబు ◆ నీలకంఠంబు
జాగేశ్వరం[2]బనఁ ◆ జను సరోవరము
నాఁ గొమరారు పు ◆ ణ్య స్థానములను
దినములు మూఁడును ◆ దివసద్వయంబు
దినము దినార్దంబు ◆ తెఱఁగొప్పనిలిచి
తారటు చని రట ◆ ధరణీధరంబు
చేరువలోనఁ బ్ర ◆ సిద్ధమైనట్టి
నరసురకిన్నర ◆ నాగగంధర్వ
వరసేవితంబై సు ◆ వర్ణకుంభముల
మెఱయు గోపురములు ◆ మేటికోటలును
[3]తురగలించెడిరత్న ◆ తోరణంబులును
అందంద మారుత ◆ హతినిఁ దొలంకు
నందులపడిగెలు ◆ సభమంద చెలఁగు
పణవభేరీశంఖ ◆ పటహమృదంగ
మణిఘంటికాడిండి ◆ మధ్వానములును
బైపైని దిక్కులఁ ◆ బర్వుదశాంగ
ధూపవాసనలుఁ బొం ◆ దుగఁగపురంపు
బలుకులు నిండారఁ ◆ బసిఁడి పళ్లెరము
నిలిపి ముట్టించిన ◆ నిండువెన్నెలల
తెలుపులు వెదజల్లు ◆ దీపమాలికలు
కలుగు కేదారలిం ◆ గముదిక్కు కేఁగి
యాభువనాధీశు ◆ నంబికారమణు
నాభక్తవత్సలు ◆ నర్థి దర్శించి
పదివేలభంగులఁ ◆ బ్రణుతించి మ్రొక్కి
మదిభక్తిసేకొన్న ◆ మత్స్యనాథుండు
సంశయింపకవచ్చి ◆ జలములు గ్రోలి

  1. నేపారి.
  2. రముజెప్పజన.
  3. తరగభటరత్న.