పుట:Navanadhacharitra.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

నవనాథచరిత్ర

నెందు నెన్నఁడుఁజూడ ◆ మిట్టి మహాత్ము
నిందు శేఖరుఁడు దా ◆ నీ జగంబునకుఁ
జరియించు వేడుకఁ ◆ జనుదెంచె ననఁగ
నురుతర భక్తి శి ◆ ష్యులు దన్నుఁగొలువ
భూనుతమహిమసొం ◆ పునఁ బెంపుమీఱు
మీననాథుండను ◆ మేటి సిద్ధుండు
వచ్చుచునున్నాఁడు ◆ వాఁడుపో యనిన
నచ్చెరువునఁ గుతూ ◆ హలము సంభ్రమము
లందుచు నిజహృద ◆ యారవిందంబు
లందు సందడిగాను ◆ నమ్మహామహుని
నాదివ్య యోగీంద్రు ◆ నా జగత్పూజ్యుఁ
[1]బోదాము దర్శింపఁ ◆ బొదఁడని యనుచు
డాలుగడ్డములు కుం ◆ డలములు మెడల
వ్రేలుజన్నిదములు ◆ వ్రేళ్ల దర్భలును
భూతిపూఁతలు దేవ ◆ పూజ సజ్జలును
నాతతకృష్ణాజి ◆ నాంబరంబులును
నలుదరుద్రాక్ష తా ◆ వళములు నక్ష
వలయంబులును నిడు ◆ వాలై న జడలు
వినుత [2]నదీపుణ్య ◆ విమలాంబుపూర్ణ
ఘన [3]కమండలములు ◆ గరుడ మాణిక్య
కాండంబులను బస ◆ గమకించు వేణు
దండంబులుసు ఘోర ◆ తపమునఁ జాల
నలజడిఁబడి గృశ ◆ మైన దేహములు
నలవడ నేతెంచి ◆ యమ్మహామునులు
తనుఁ బదివేలు చం ◆ దముల దీవించి
వినుతులు గావింప ◆ వికసిల్లి వారిఁ
గరుణామృతము నిండఁ ◆ గడలొత్తు చూడ్కిఁ
బరిపాటి నందఱఁ ◆ బరగ వీక్షించి
చెన్నొంద వేర్వేఱ ◆ సేమంబు లడిగి
మన్నించె నెంతయు ◆ మత్స్యనాథుండు
దాన నుప్పొంగి సం ◆ తసమున మునులు

  1. పోదండుదర్శింప బోదాడుయనుచు
  2. సత్పుణ్యాది.
  3. 'కమండలువులు' ఆయుఁ బఠింపవచ్చును.