పుట:Narayana Rao Novel.djvu/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
65
గృ హ ప్ర వే శ ము

కెన్నో చిత్రములైన బొమ్మలు అచ్చట తగిలించి యున్నవి. చిత్రవిచిత్రముగా నగిషీలు చెక్కిన బల్లలు, మేజాలు, కుర్చీలు, బీరువాలు, అలమారులు, పనితనముగల వెండి, ఇత్తడి, రాగి బొమ్మలు చీనా దేశపువి, ఆగ్రా, అజిమీరు, లక్నో ప్రాంతములవి, బర్మా కఱ్ఱ చెక్కడపు బొమ్మలు, లక్కబరిణలు, రవివర్మ బొమ్మలు, పాశ్చాత్య తైలవర్ణ చిత్రములు తమ పెద్ద మేడనిండ నున్నవి. తన తండ్రిగారిది, తాతగారిది, తల్లిది, బామ్మగారిది ఇంకను బూర్వికుల బొమ్మలు దమ గదులనిండ నలంకరింపబడియున్నది. ఇచ్చటనో తన భర్తగది యొకటి మాత్రము చాల అందముగా నున్నది. ఇల్లంతయు సూర్యకాంతము చూపించినది. భోషాణములట! తంజావూరి బొమ్మలట! మామూలు కుర్చీలు, పేము పడక కర్చీలు, ఆ కుర్చీల పై మామూలు పరుపుదిండ్లు. తమ మేడయంతట తండ్రి గారు స్వంతముగా విద్యుచ్ఛక్తి దీపములు, వీవనలు పెట్టించినారు. అత్తవారింట లష్టరు దీపాలట, పెట్రోమాక్సు దీపాలట! చీచీ! ఇది ఏమిటమ్మా!

శకుంతలా దేవి చెల్లెలిని జూచి ‘ఒసే శారదా! మా అత్తవారి మేడలో మన మేడలోనున్నన్ని వింతలు విచిత్రాలు లేకపోయినా అదీ జమిందారీకోట లాగే ఉంటుందే. కాని ఇల్లాంటి పల్లెటూరు కొంపలో పడ్డావేమిటే? వంద మంచాలూ, పరుపులూ ఉంటేమాత్రం జమిందారీ దర్జా వస్తుందటే? వచ్చి వచ్చి ఒక పల్లెటూరి వెంకయ్య గారి ఇంట్లో పడ్డావేమిటే? ఎంతో డబ్బుందట. చాలాభూమి ఉందట. ఏమి భాగ్యం? దర్జా పుట్టుకతో రావాలి గాని, తెచ్చిపెట్టుకుందామంటే వస్తుందటే?

‘వీళ్ళ కట్లు, బొట్లు, మాటలు అన్నీ చాదస్తంగా ఉన్నాయి, అక్కయ్యా.’

‘మీ పెద్దాడుబిడ్డ ఒకటే వడవడ వాగుతూవుంటుం దేమిటే! నన్నూ, లలితనూ, సరోజినినీ కూచోబెట్టి వేదాంతం బోధించడం మొదలుపెట్టింది. రెండో ఆవిడ మనకుటుంబం సంగతులు అన్నీ అడగడం మొదలుపెట్టింది. అస్తమానం ఈ చెవినుంచి ఆ చెవికి నవ్వుతోనేవుంది ఆవిడ.

లలిత: వాళ్లు చిన్నబుచ్చుకునేటట్లుగా మనం గబుక్కునలేచేవచ్చాంగా!

సరోజిని: ఏమే శకుంతలా! నీకు వేళాకోళాలు వెక్కిరింతలూను. వాళ్ళూ మనమల్లేనే గౌరవం సాంప్రదాయం కలిగిన కుటుంబాలు. అందరికీ జమిందారీలు ఉంటాయా యేమిటే? దేశమంతా గాలించినా గుడిగుడి గుంచంలా ఒక పది జమిందారీకుటుంబాలు న్నాయి. మీ నాన్నగారికి పదిమంది కూతుళ్లు పుట్టితే అందరికీ జమిందారీ సంబంధాలు ఎక్కడ తీసుకువస్తారే?

శకుంతల: నువ్వెప్పుడూ అందర్నీ హాస్యం చేస్తూనేవుంటావు. జమిందారీలు వుండకపోవచ్చును గాని ఎక్కడో పల్లెటూళ్ళపద్ధతిలావుంది అనరుటే.

ఇంతలో సూర్యకాంతం అక్కడకు వచ్చుటచే వారి సంభాషణ ఆగిపోయినది. సూర్యకాంతం చిన్నన్న గారిని వెర్రిప్రేమతో ప్రేమించినది. తల్లి