ఇతర దినాలు
63
లోటు లేదు. దాసదాసీజనమును బెట్టి చేయించుకొను శక్తియున్నది. నారాయణ దుర్వ్యయములకు లోనుగాకున్న జాలును. ఎట్టికొఱతయు నుండదు. బుద్ధికి బృహస్పతియయిన తన కుమారుడు, కుటుంబమునకు విఖ్యాతి తెచ్చుచున్న తన నారాయణుడు సంపాదింపలేని అప్రయోజకుడగునాయేమి? ఈ రోజులలో బ్రాహ్మణులకు ఉద్యోగములు దొరకనిమాట నిజమే. సంపాదన కుద్యోగమే కావలయు నాయేమి? చెన్నపట్టణములో న్యాయవాదియైన లక్ష లార్జింపవచ్చును. కుమారునకు మొదటినుండియు ‘లా’ యన్న యసహ్య మనుట నిజమే. తన ప్రోద్బలమువలననే కుమారుడు ఎంత ఇష్టము లేకున్నను న్యాయకళాశాలలో ఏది ఎట్లయినను ఆ విషయముల దాను తర్కింప బనిలేదు. గాంధీతత్వపూర్ణుడైన నారాయణుడు, ఏదియు వలదని యన్నను సరియే. ఆలోచింపవలసినది కోడలివిషయమే.
ఆ బాలిక ఎట్టిది యగునో? సర్వసాధారణముగ నీ జమిందారీ కుటుంబములలో గర్వమెక్కుడు. జమిందారుల యింటి యాడుబిడ్డ తనవంటి సంసారి యింట నతుకుట కష్టమే. నీటి నుండి తీసిన చేపవలె తనయింట బాధపడునేమో? కాని బుద్ధి తెలిసినపిల్ల గావున ఆమె అభిప్రాయము తెలిసికొనక వియ్యంకుడు తన కుమారుని అల్లుని గా నిశ్చయించియుండడు. కోడలికి నారాయణపై ఆపేక్ష కుదిరియుండును. అందును నారాయణు డెట్టివారి హృదయము నైనను చూరగొనగల గుణసంపత్తిగల వాడు. బాలికలు వీనిని భర్తగా బడయుట తమ జన్మములకు సార్థకతయని సంతసించునంతటి రూపవంతుడు. ఇంతకు ఈ రాజ సంబంధము మంచికి వచ్చినదో, చెడ్డకు వచ్చినదో? అంతయు దైవాధీనము. ఎవరి ప్రారబ్ధ మెట్లున్నదో? ఆ పరమేశ్వరుని విలాసము లెవరికి దెలియును! నేటివఱకు దానుపట్టిన దెల్ల బంగారమగుటయే గాని ఒక్క కార్యముగూడ గలసిరాకపోవుట యన్నది లేదు. ఏనాటి కే విచిత్రములు జరుగనున్నవో!
సుబ్బారాయుడు గారు గంభీరహృదయుడు. ధైర్యస్థైర్యము లాయన సొమ్ములే. చిన్ననాటనే తండ్రిపోయినను మనస్సు చెదరనీక నడిసంద్రమున నల్లాడు సంసారనౌకను చుక్కాని చేబూని చెక్కు చెదరకుండ గట్టున జేర్చినాడు. ఇతరుల డెందములు నొవ్వకుండ న్యాయమార్గమున తన పితృస్వమును వేయిరెట్లు వృద్ధి చేసి పిల్లజమీందారు డనిపించుకొనినాడు. ‘గోదావరికి అద్దరిని ఇద్దరిని సుబ్బారాయిడు గారి మాటయు భీష్ముని మాటయు నొకటే’ యని పించుకొనినాడు. నేల మాళిగలో నసంఖ్యమై మూలుగుచున్న నగదులో నిరువదియైదు వేల రూప్యములు కొమరుని పెండ్లికి వెచ్చించినాడు. తనయంతవాడైన పెద్దకొమరుని మనస్సేమనుకొనునో యని సందేహించనైన లేదు.
శ్రీరాముమూర్తికి వెచ్చపెట్టుటన్న దలనొప్పియే కాని, అవసరము వచ్చినప్పుడు మాత్రము వెనుదీయడు. తన నల్గురు చెల్లెళ్ళ వివాహములకు మువ్వురు చెల్లెళ్ళ పునస్సంధానమహోత్సవములకు, బండుగలకు పబ్బములకు సుబ్బా