పుట:Narayana Rao Novel.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

నా రా య ణ రా వు


జీవితం ప్రారంభించి అడవుల్లో సంచరించే రోజుల్నుంచీ మానవ జీవితం ఎంత విచిత్రంగా మారిపోయింది యీ పవిత్ర వివాహసంస్థవల్ల!’

‘నిజం. భర్త ఏరకంవాడయితే భార్య కూడా ఆరకంలో కలిసిపోతుంది గదా. వకీలు భార్య అయిందనుకో ‘లా’ మాటలు వింటూ వుంటుంది. క్లయింటు రావటం, భర్త కేసుల్లో వాదించడం, గెలవడం, ఓడటం అనే భావాలలో ఐక్యం అవుతుంది. అదే డాక్టరు భార్య అయితే, రోగులు, రోగాలు, మందులు, ఇంజెక్షన్లు రాత్రీ పగలూ పని ఉండడం అనే ప్రపంచానికి రాణీ అవుతుంది. అలాగే ఉద్యోగస్తుని భార్య అయితే ఆవిడకు ఉద్యోగ ఫాయాలన్నీ అలవాటవుతాయి. అవును గాని, నాకు మొదటి నుంచీ ఒక్క ప్రశ్నకు సరిఅయిన జవాబు దొరకడం లేదురా! ఏమిటంటే, మగ వాడి జీవితంవల్ల ఆడదాని జీవితం ఎక్కువ మార్పు చెందుతుందా, లేక ఆడదాని జీవితంవల్ల మగవాడి జీవితమా?’

‘అది మంచి ప్రశ్నే! నా అభిప్రాయం ఏమిటంటే, ఆడదాని జీవితం దర్హంమీద స్వచ్ఛమైంది. మగవాడి జీవితపు రంగు తనమీద పడగానే, దానితో ఆమె నిండిపోతుంది. గృహనిర్వహణానికి సంబంధించిన సంసారవిషయాల్లో మాత్రం ఆడదాని వ్యక్తిత్వమే అధికంగా గోచరిస్తుంది. కాబట్టే ఇల్లుచూచి ఇల్లాలిని చూడమన్నారు. మగవాడు మృదుస్వభావం కలవాడైతే ఒక్కొక్కప్పుడు ఆడదాని స్వభావం పైచేయికావడం, వాడి జీవితంలో ఆ ఛాయలు విశేషించి కనిపించడం కూడా తటస్థిస్తుంది.

సుబ్బారాయుడు గారు తన రెండవ కుమారుని వివాహమును గూర్చిఎన్నియో విచిత్రాలోచనలలో తేలిపోయినాడు. ఆయన నలుగురు కొమార్తెలకు, పెద్ద కొమరునకు, మంచి గౌరవముగల కుటుంబములుగా జూచి వారితో వియ్యమంది నాడు. సంబంధములన్నియు ధన ధాన్య సంపదలతో దులగూగుచున్నవే. చుట్టములలో ననేక వివాహములకు దాను బెద్దరికముదాల్చి చక్కగా జరిపించినాడు. అవియన్నియు నొక యెత్తు. నేడు నారాయణ వివాహమొక యెత్తు. ధనమా చాల వ్యయమైనది. వ్యయమయినదని కాదు. అంతకు మూడు రెట్లయినను ఆయన లెక్క చేయడు. ఆవల వియ్యంకునకు గూడ వివాహవ్యయమొక లకారము దాటి యుండును. ఆయన జమిందారు గావున ఆయనకు లెక్క లేదు. జమీందారు గదాయని తన యెడల ప్రపత్తులలో నేమైన లోటు చేసినారా? ఒక పెద్ద మహారాజును గౌరవించినట్లు గౌరవించినారు. ఇంతకు దన వియ్యంకుడు నిషధ యోగ్యుడు. కాని వియ్యపురాలు సరియైన మర్యాదతో సంచరించలేదని ఆడువాండ్రు ఒకటే గోల. అది ఆమె స్వభావము కాబోలు. క్రొత్తలో నించుకంత పొరపున్నను, గాలక్రమమున వియ్యపురాం డ్రిద్దరకు నెయ్యము కుదురవచ్చును.

ఆగర్భ శ్రీమంతురాలై పెరిగిన కోడలు, తనయింటికి వచ్చి కష్టపడునేమో? కుఱ్ఱవాడు ఎక్కడో ఉద్యోగమో, న్యాయవాదిపనియో చేసికొనును. వాడు సంపాదించుకొనకున్నను భగవంతుని కృపచేత వానికి అన్న వస్త్రములకు