పుట:Narayana Rao Novel.djvu/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
51
వి వా హ ము

‘అమ్మా, శారదను తీసుకు వెళ్ళి పల్లెటూళ్ళ పేడదొడ్లలో పడవేశారేమమ్మా?’ అని శకుంతలాదేవి చిన్నవోయిన మోముతో ననినది.

‘వదినా! మీ అమ్మాయికి మా అబ్బాయికన్న చాలగొప్ప సంబంధం తెచ్చారనుకొన్నాము. చూడ ముచ్చట వేస్తోంది. మా వైపు పనిచేసేవాళ్లు ఇంతకన్న చాలా నాజూకుగా ఉండిపోతారే’ అని జగన్మోహనరావు జమిందారుగారి తల్లి శివకామసుందరీదేవిగా రనిరి.

‘అవునండీ పిన్నీ, వాళ్ళ బట్టలు వాళ్లే ఉదుక్కుంటారట. పిడకలు చేసుకుంటారట. నీళ్లు తెచ్చుకుంటారట. పొలాలు వెళ్ళి గడ్డీగిడ్డీ కోసుకు మోపులుకట్టి తెచ్చుకుంటారట’ అని జమిందారు గారి వేలువిడిచిన మేన కోడలు లలితకుమారిదేవి యనినది.

‘ఆ నగలేమిటి? ఆ బొట్లేమిటి? ఆ చీరలేమిటి? గాడిదలకు దిగబోసి నట్లే! కోరి కోరి వేదికి వెదికి తెచ్చారే!’ అని మఱియొక శ్రీమతి ముక్కుపై వేలు వైచుకొనినది.

అందఱు వెడవెడ నవ్వులు విరగబడి నవ్వుకొని నారు. వియ్యపురాలు జానకమ్మ గారు గూడ వారి హేళనకు గురియైనది.

‘ఆవిడేనా వియ్యపురాలు! కూడా వచ్చిన పేరంటాలనుకున్నాను!’ అని హైకోర్టు న్యాయవాది ఆనందరావుగారి భార్య ప్రమీలా దేవి యనినది.

‘ఇంతకూ మా శారద అదృష్టం యిలా అయింది’ అని వరదకామేశ్వరీదేవి కన్నుల నీరునింపుకొంది.

ఆ ప్రక్కనే సోఫాపై నధివసించి యీ సంభాషణ లాలకించు శారద హృదయము పరిపరివిధముల బోయినది.

ఆమె తోటిబాలిక యోకర్తామెకడనే వసించి యున్నది. ఆ బాలిక కేలనో నారాయణరావు చక్కనివాడని తోచినది. ఆ బాలకు మొన్న మొన్ననే వివాహమైనది. ఆమెవరుడుగూడ శ్రీమంతుడు. విద్యావంతుడే! అయినను తేజస్సుతో నిండిన నారాయణరావు మొగము, అతని రూపసంపద ఆ బాలికకు జూడముచ్చటయైనది. ఆ బాలిక శారద పినతండ్రి కుమారితె. ఆమె పేరు నిరుపమా దేవి. ఆ బాలిక జనకుడు చెన్నపట్టణములో న్యాయవాదిగా నున్నాడు. శారదకు, నా బాలికకు మిక్కిలి స్నేహము. ‘శారద! నీ భర్త ఇంగ్లీషు భాషలో చాల గొప్పవాడే!’

‘ఎల్లా తెలిసిందే నీకు?’ క్రొత్తక్రొత్త ప్రపంచములో గన్నులువిప్పు నీ బాలికకు సిగ్గులుండరాదని వారి మతము. సిగ్గుపడువారిని గాంచి పల్లెటూరి వారని వారిలో వారే నవ్వుకొందురు.

సంబంధము తండ్రి తెచ్చినాడు. బాబయ్య గారు తెచ్చిన సంబంధము నందు లోపము లుండగూడదు. పెళ్ళి వారందరూ పల్లెటూరివారే. పల్లెటూరివా