పుట:Narayana Rao Novel.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

నా రా య ణ రా వు

రగుటయే లోపమైనచో బాబయ్యగారి కది గొప్ప సంబంధమని యెట్లుతోచినది? బాబయ్య గారికి తనపై చాల ప్రేమ. ఎందు కిట్టి సంబంధము తెచ్చినారు? లోన సిగ్గుపడుచు... పెండ్లి ... చాల అందంగా ఉండెననియా అనుకొనినది. అంతలో ఆమె త్రపాహృదయయై ఆ యాలోచన మానికొన్నది. ఆమె మోము చిరునవ్వున ప్రఫుల్లమైనది.

‘ఏమిటే శారదా! చిరునవ్వు నవ్వుతున్నావు’ అని నిరుపమాదేవి యన్న ది.

‘ఏమి లేదే?’

‘వూరక నే నవ్వుకుంటారటే!’

‘ఏదో ఆలోచన తట్టి నవ్వు వచ్చింది.’

‘ఏమిటా ఆలోచన! మీ ఆయనమీదేనా?’

‘నువ్వు నన్ను వేళాకోళం చేస్తావేమిటే? వరసా తెలవదు వావీ తెలవదు!’

‘నువ్వు వరస కాకపోవచ్చును. కాని బావగారు కాదా ఏమిటి?’

నిరుపమకు బావగారా! నిరుపమ తనకన్న కొంచెము పెద్దదిగా! నిరుపమ యా యాలోచన గ్రహించి ‘బావగారని ఎందుకన్నా నంటావు? మనం ఇద్దరం కొంచె మెచ్చుతగ్గు ఒకేయీడు. అందుకని బావగారన్నా తప్పులేదే!’

నిరుపమ నారాయణరావును సంతతము మేలమాడునది. నిరుపమ ఆడు పిల్లల పాఠశాలలో నయిదవ ఫారము చదువుకొనుచున్నది. నారాయణరావా బాల హృదయము చూరగొనినాడోయన నిమేషమేని నాతని వదలక ఇంగ్లీషులో సమస్త విషయముల గుఱించి మాట్లాడునది.

శారద యిది యంతయు జూచి యించుక యక్కజమందినది. నిరుపమ శారదను జూచి—

‘మీ ఆయన చాలా తెలివైనవాడే. ఏ సంగతైనా నేనడిగేటప్పటికి, అతివిపులంగా తెలిసేటట్లుగా మంచి కథలా చెప్తాడే. ఎన్ని సంగతులు! ఎంత బాగా తెలుసును! మా మాష్టరుగారు పుస్తకము చదువుకొనివచ్చి మా కందరకూ చెప్పితే నిద్రవస్తుంది. నాకు ఇంటిదగ్గర చెప్పే మా మాష్టరు గారు చెప్పిన దానివల్లను పాఠం అర్థంకాకపోవడమూ ఉన్నది. కాని మీ ఆయన అద్భుతంగా పాఠం చెప్పగలడు. ఆయనదగ్గిర పాఠాలన్నీ చెప్పించుకుంటూంటే చాలా బాగా ఉండును’ అని పంచమస్వనంతో పలికింది.

‘చెన్న పట్నంలోనే ఉంటావు! అక్కడ అన్నీ చెప్పించుకోవచ్చును.’

‘అదిగో అప్పుడే ఉడుకుపోతుతనం! ఎక్కడ వీలవుతుంది? మా నాన్న గారితో చెప్తాను. మీ ఆయనకు చాలా బాగా సంగీతం వచ్చునట. పెండ్లి