పుట:Narayana Rao Novel.djvu/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెంపపెట్టు

391

విశ్వే: ఒక మారుమూలకు ఎల్లా వెడ్తారు?

జమీం: ఇప్పుడేం చేయగలము? మా రాజమండ్రి వాళ్ళు కొంచెం తగలేశారు. కాని చాలా బాగా వృద్ధిఅవుతోంది ఆంధ్ర విశ్వవిద్యాలయం.

మేనత్తకు జ్వరము నెమ్మదించిన పదిరోజులకు జగన్మోహనరావునకు వీలయిన కాలము దొరికినది. విశ్వేశ్వరరావుగారు, జమీందారు రెండురోజులై వెళ్ళిపోయినారు. శకుంతలకు నీరాడు ప్రొద్దులు వచ్చుచున్నవి.

శారద జగన్మోహనునితో జనవుగా దిరుగుచున్నది. చనవుగ మాట్లాడుచున్నది. ఆ సమయములో ఆమెకు హుషారు పుట్టించి, ఆమెను కౌగిలించుకొని ముద్దిడుకొనవలయును. మోమోటముచే, దనకున్న చనువుచే, ప్రథమమున నామె కొంత యడ్డము పెట్టినను తన మోహమున నామె కరిగిపోవలయును.

ఆహా! ఏమి యీ బాల యందము! నవమోహనాంగి. ఇంత అందకత్తె యైనదే! ఈ యందానికి సాటియే లేదు. ఆమె యవయవములన్నియు నేదోషము లేక గ్రీకు దేవత వీనసువలె నున్నవి. ఈమెతో మోహానందపు లోతు నెరుంగని నాడు తన జన్మ వృథా!

ఆ సాయంకాలము శారదతో దాను భోజనమునకు ముందులేచి, తక్కిన యందరు భోజనము చేయుచున్నప్పుడే, మేడపై శారద గదిలో ... తాను పరిపూర్ణమగు సంతోషము ననుభవింపవలె.

ఆ రోజు జగన్మోహనుడు తనకున్న తెలివినంతయు జూపెను. హార్మోనియముపై ఇంగ్లీషు పాటల వాయించుచు పాటల బాడెను. నాట్యమాడుట చూపెను. శారద సమ్మోహనాస్త్రపీడితయైనట్లు, సర్పమునుజూచి చేష్టలుడిగిన మండూకమువలెని స్తబ్ధయై మెలంగినది. సాయంకాల మేడుగంటలకు నారాయణుడు కారులోనుండి దిగినాడు.

౨౩

చెంపపెట్టు

నారాయణరా వత్తవారింటినుండి వచ్చిన వెనుక నమలాపురం వెళ్ళి రాజారావును గలిసికొన్నాడు.

నారాయణా! నేనెంతో యాలోచించితిని. తల్లిదండ్రుల అయిష్టతకు లెక్కచేయను. పూర్ణముగ నాలో వాంఛ జనించినదేమోయని క్రుంగిపోవుచున్నానోయి!

‘ఓయీ, వెఱ్ఱివాడా! వాంఛా? మన యీ అల్పజీవితములో సరియైన మార్గాన్ని నడచినట్లయితే వాంఛే ఉన్నతమైంది అవుతుంది. నీ భార్యకానున్న యామెను వాంఛించుట ఎలాటితప్పు? సరే యిష్టపడ్డావు. నీకు ప్రేమసంతోషం మాటలచేగాక చేతలచే చూపిస్తే సిగ్గు, అయినా నిన్ను కౌగిలించుకొంటున్నా!’ యనెను. నారాయణరావు హృదయం వేయిపాలసముద్రముల