పుట:Narayana Rao Novel.djvu/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతి - పురుషుడు

305

‘రామచంద్ర! మళ్ళీ మన మెప్పుడు కలుసుకొనుట? నీవు మరల అమెరికాకు వచ్చుటో లేక నేను హిందూదేశమునకు వచ్చుటో, లేనియెడల నీరూపము నా దృష్టి పథమునుంచి మాయ మైపోవును.’

‘అదేమిటీ నారా! అంత విచారముగా ఉన్నావు? నీవంటి ధైర్యమైన పిల్లను మా దేశంలో చూడనే చూడము. కథల్లోమాత్రము వింటాము.’

‘నీ వెందుకు నా జీవిత నాటకంలో నొక ప్రాత అయినావు?’ ‘అది ఉత్తమ సంఘటనం కాదా. అది నా అదృష్టంకాదూ?’

నీ వున్న మూడేళ్లు నాకు నీవు సమకూర్చిన ఆనందము నా వ్యక్తిత్వమును ఉన్నతపథాల కెత్తివేసినది.’

‘లీ! ఈలాగున ఏమిటి వణికిపోతున్నావు!’

‘రామ్! నా ప్రియతముడైన స్నేహితుడా! భారత దేశము మహాత్ముని నాయకత్వాన సలుపు ప్రేమమహాసంగ్రామమువలన నే ప్రపంచమునకు ధర్మ సందేశ మొసగగలదని నీవు సల్పిన జ్ఞానబోధ నన్నొక నూతన వ్యక్తిని చేసింది. ఆలోచించినకొద్దీ ప్రపంచాన్ని తరింప చేయుటకు అమెరికా హిందూదేశములు రెండూ కలియాలి. భరత దేశము పురుషుడు, మా దేశము స్త్రీ. ఈ రెంటికీ సంపూర్ణ సంయోగము కలగాలి. ఆ నాడు ప్రపంచబోధ ప్రారంభమవుతుంది.’

‘నా ప్రాణప్రియ స్నేహితురాలవగు లియోన్! నీ వివాళ భగవంతుని సాన్నిధ్యమునుండి యవతరించిన దేవతలా ఉన్నావు. నీ మోమున దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉంది. ‘నీ శిరస్సు వెనుక తేజోమండలము వంగపండు చాయతో గన్పట్టుతూ ఉంది.’

లియొనారా నవ్వుచు రామచంద్రుని ఒడిలోకివచ్చి కూర్చున్నది. సత్యప్రదర్శకములగు నామె కన్నులు పారలౌకికమగు నవ్వు నవ్వుచున్నవి. రామచంద్రు నామె కవుగిలించుకొన్నది. రామచంద్రుని మూర్తి పులకరించిపోయినది.

మా క్రైస్తవమతస్థు లెందరో శ్రీ యేసుక్రీస్తు దివ్యబోధ గ్రహించలేక పోయినారు. హోల్మ్సు మహాఋషి చెప్పినట్లు శ్రీ గాంధి, క్రైస్త అపరావతారమే! భగవద్గీత లోని బోధయే యేసు కొండమీదయిచ్చిన ఉపన్యాసం’

‘నా లియోన్! నే నిదివరకు మా దేశాననున్న దివ్యమణులగు గ్రంథరాజా లేమి చదువలేదు. నా లెక్కల్లో నేను పడివున్నా . ఏనాడు నిన్ను ప్రథమాన్ని ఓడపైన దర్శించానో, ఆ శుభముహూర్తా న్నే అమెరికా హిందూ దేశము లేకమై ప్రపంచానికి మార్గదర్శకము లవ్వాలని నాకు మెరుపు వలె హృదయమున గోచరించినది. ఇన్ని వందల సంవత్సరాలుగా ఇంగ్లండు భారత దేశమును పాలిస్తూ, భరతదేశ సందేశాన్ని గ్రహింపలేకపోయింది. ఇంగ్లీషువారు రాజ్యము చేయుట మాకు మరియు ఉపకార మైనది. భగవంతుడు వారి ఆక్రమణముచే మమ్మందరినీ యేకం చేసినట్లయింది సుమా.’

‘నా హృదయానికీ, ఆత్మకూ ప్రియమిత్రుడవైన రామచంద్ర! సర్వ