పుట:Narayana Rao Novel.djvu/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

నా రా య ణ రా వు

తప్పక వస్తుంది. కాని డి. ఇ. ఇ. తప్పదు. ఇంకనూ ఉన్న కొలదీ నేర్చుకో వలసింది చాలా ఉంది. కాని మన దేశంలో విశ్వవిద్యాలయాలు చాలా ఉన్నవి. ఏ విద్యాలయంలో నైనా నాకు ఉద్యోగం సంపాదించి పెట్టగలవని నా నమ్మకం. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రొత్తగా పెట్టారుకదా! అందులో నాతో ఆచార్య పదవి సంపాదించగలవను నా నమ్మిక కు నువ్వు వ్యతిరేకం చెయ్యవద్దు. నేను డబ్బు సంపాదించాలనీ, లేక పోతే కూడుదొరకదనీ కాదుగదా ప్రవేశించుటకు కోరేది. ఏదైనా విశ్వవిద్యాలయంలో ఉండి, విద్యుచ్ఛక్తి విషయమై కొత్త సంగతులు చాలా పరిశోధించవలెనని ఆశయము ఉంది. విశ్వవిద్యాలయములో నాకు ప్రవేశం దొరకకపోతే, ఏ బెంగుళూరు శాస్త్ర పరిశోధనాలయములో నైనను సరే ప్రవేశము నా కిప్పించకోరుతూ ఉన్నాను.

చి. సౌ. సూరీడుకు చదువు చెప్పించి, ఈ యేడు ప్రవేశ పరీక్షకు పంపిద్దామన్న ఉద్దేశం నీకు కలగడం చాలా ప్రశంసనీయం. పరీక్షలో నెగ్గితే అమెరికా నుండి మంచి బహుమతీ తెస్తున్నా నని చెప్పు. ఆవిడకూ నేను ఉత్తరం రాస్తున్నాను. నా సహోదరి శారదాదేవిని నే నింతవరకు చూడలేదు. ఆమెయు, మా చెల్లెలును కలిసి చదువుచున్నారని వినుటకున్ను చాలా సంతోషమయినది. చి. సౌ, నూరీడు సంగీత ముకూడా బాగా నేర్చుకున్నదని పాశ్చాత్య సంగీతముకూడా నేర్చుకుంటూన్నదని నీ ఉత్తరంలో చదివినప్పుడు నా కపరిమితానందం కలిగింది.

నేను జులై నెలలో బయలు దేరి ఇంగ్లండుమీదుగా వస్తున్నాను. బొంబాయి వచ్చి అచ్చటి నుంచి కొలంబోవచ్చి రైలుమీదవస్తాను. ఇంటికి నేను చేరుకునేందుకు రెండు నెలలు పట్టును. ఈలోన ఇంగ్లండు, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లండు, ఇటలీ చూచుకొని మరీ వస్తున్నాను. నీ కేమి కావలసినా తంతి నీయవలయును.

ఇట్లు నీ ప్రియమైన రామచంద్ర

విద్యుచ్ఛక్తి విద్యాలయములో బరీక్షలు సంపూర్ణము లయ్యెను. రామచంద్రరావు విజయము గాంచి జయపత్రమును భారత దేశమున కంపుట కేర్పాటు చేసికొని, మరల నొకపరి దేశములోని చిత్రములు చూచెదను గాక యని నయగరా పతనమునకు బోయినాడు.

రామచంద్రు డిక నమెరికా వదలి వెళ్లిపోవుచున్నాడని లియొనారా కన్య విచారగ్రస్థయయినది. ఇన్నాళ్లు రామచంద్రు నొక ని మేష మేనియు నెడబాసి యుండలేదు. అతని నా బాలిక నయగారా తన కారుమీద కొనిపోయినది.

దారిలో నొక నిర్జనప్రదేళము కడ ప్రకృతి లీలావినోదిని యొసగు చోట కారు నాపినది.