Jump to content

పుట:Narayana Rao Novel.djvu/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర నవకవి సమితి

279

చిత్రకళా ప్రదర్శనమునకు దేశదేశ చిత్రకారుల కాహ్వానము లంపినారు. శాంతినికేతనమునుండి నందలాలుగారు, కలకత్తా నుండి అవనీంద్రనాథఠాకూరుగారు, లక్నో నుండి అసితకుమార హవల్దారుగారు, పంజాబ్ నుండి అబ్దుల్ రహమాన్ చౌకుతాయిగారు, బరోడానుండి ప్రమోదకుమార చటోపాధ్యాయులు, మైసూరునుండి వెంకటప్పగారు, బొంబాయినుండి సాలొమానుగారు, అహమ్మదాబాదునుండి కనూదేశాయిగారు, మణిభూషణగుప్తగారు, ముజుందారు, సుధాంశుచౌదరి, దేవీప్రసాదరాయి చౌదరిగారలు మొదలగువారును; ఆంధ్రదేశములో రాణ్మహేంద్రవరమునుండి వరదా వెంకటరత్నంగారు, శ్రీమతి దిగుమర్తి బుచ్చికృష్ణమ్మగారు, చామకూర భాష్యకార్లుగారు, భీమవరమునుండి అంకాల సుబ్బారావుగారు, గ్రంధి శేషారావుగారు, తంగెళ్లమూడి వేంకటసుబ్బారావుగారు, గుంటూరునుండి గుఱ్ఱం మల్లయ్యగారు, అనిశెట్టి సుబ్బారావుగారు, చెన్నపురిలోని కవుతా రామమోహనశాస్త్రిగారు, కేశవరావుగార్లు, గుజరాతునుండి కవుతా ఆనందమోహనశాస్త్రిగారు, విశాఖపట్టణమునుండి తలిశెట్టి రామారావుగారు, కాకినాడ నుండి చామకూర సత్యనారాయణగారు, నరసాపురముమండి వెన్నా శేషగిరిరావుగారు, ఏలూరునుండి చండ్రుపట్ల బాపిరాజు, రామారావుగారలు, పెనుగొండ నుండి వెంకట్రావుగారు యింకను బాలచిత్రకారులు తమ తమ చిత్రములను ప్రదర్శనమునకు బంపిరి.

ఆహ్వానము లంగీరించి ఆంధ్రదేశ వివిధ మండలాల నుండి రాయప్రోలువారు, విశ్వనాథవారు, తల్లావఝులవారు, కురుగంటివారు, దేవులపల్లివారు, వేదులవారు, నండూరివారు, కాటూరివారు, మాధవపెద్దివారు, దువ్వూరివారు, పింగళివారు, మునిమాణిక్యులు, కవిరాజులు, మొక్కపాటివారు, నోరివారు, నాగేంద్రరాయలు, చింతావారు, పంచాగ్నులవారు, కరణంవారు, కోలవెన్నువారు, మల్లంపల్లివారు, తుమ్మలవారు, భావరాజువారు, కవికొండలవారు, మల్లాదివారు, పువ్వాడవారు, త్రిపురారిభట్లవారు అనేకులు సభల నలంకరించినారు.

పచ్చయప్ప కళాశాలాభవనములో కవుల సభలుజరిగినవి. నానాప్రాంతాగతులయిన సుప్రసిద్ధ కవులు తాము క్రొత్తగా రచించిన పద్యములు, పాటలు మనోహరముగ జదివి వినిపించినారు. సాయంకాలముల గోఖలేభవనమున గొప్ప ఉపన్యాసముల నిచ్చినారు. ఉత్తమ గాయకులు సంగీతము పాడి వినిపించిరి. ఒకనాడు కూచిపూడివారి భాగవత ప్రదర్శనము, ఒకనాడు జంగంకథ, దేశీనాట్యములు మున్నగు వినోదములు ప్రదర్శింపబడినవి. రసజ్ఞులు, విమర్శకులు కవితావిషయములగూర్చి చక్కని ఉపన్యాసములు చేసిరి. ఒకనాడు శ్యామసుందరీదేవి చెల్లెండ్రతో పాటకచేరి చేసి, సభ్యుల నానందమున నోలలాడించినది. ఆ సమయమున నారాయణరావు ఫిడేలుతో వారి ననుసరించెను. పరమేశ్వరుడు తాను రచించిన ఏలపాటలు సహజ మధురతాపూర్ణస్వనమున