పుట:Narayana Rao Novel.djvu/274

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
273
ఆం ధ్రు లు డాం భి కు లు

వెళ్ళాడు. రాయివేసి రక్తం స్రవించకుండా రక్తనాళాన్ని గట్టిగా కట్టాడు. నేను వెనకాలే పరుగెత్తుకొని లైజల్‌బుడ్డి, పళ్ళెము, నీళ్ళకూజా, దూది, గుడ్డలు మాదగ్గర ఉన్నవి పట్టుకువెళ్ళాను. అవి వాడికిస్తే...

నళిని: (చిరునవ్వు నవ్వి) మధ్య మిమ్మల్ని వీరుణ్ణి చేసుకున్నారే!

పర: (నవ్వుచూ) తప్పదు. ‘మంచిపని చేశావురా’ అని ‘నీళ్ళు’ అని పొలికేక పెట్టి, కాలుకడిగి నేను తెచ్చిన లైజాలు నీళ్ళలోవేసి, పాదం అంతా కడిగి తనజేబులో ఉన్న చాకుతో కాలికి ఉన్న బూటుకోసి తీసివేశాడు. టించరు అయోడిన్ వేసి గుడ్డ చుట్టాడు. ఇంతలో డాక్టరు వచ్చాడు.


౧౮ ( 18 )

ఆం ధ్రు లు డాం బి కు లు

నళిని: మా అక్కకన్న బాగా ఫస్టుయైడు (మొదటి వైద్యసహాయం) చేశారే! చాలా సంతోషంగా ఉంది. తర్వాత?

పర: తర్వాత ఏముంది అమ్మా! మేం వచ్చేశాం. మా అడ్రసు ఇచ్చి వచ్చాము కాదూ? మొన్ననే ఉత్తరం రాశాడా బొంబాయి పెద్దమనిషి.

రాజా: ఇంకా మీ నారాయణరావు వీరకృత్యాలుంటే వర్ణించవోయ్ కవీ!

శ్యామ: డాక్టరు అన్నగారూ! నారాయణరావు గారికి బాగా యీత వచ్చునట కాదూ?

రాజా: పరమేశ్వరుడికీ వచ్చును.

పర: మా నారాయుడి యీత గజీతలెండి. ఒకమాటు రాజోలుదగ్గర పడవ రేవు దాటివస్తూఉంది, గాలి బాగా వీస్తూంది. గోదావరి కెరటాలో ఉబికిపోతూ ఉన్నది. నారాయణరాపూ, నేనూ నర్సాపురం నుంచి స్టీమరు మీద వచ్చి రేవులో దిగుతున్నాము. ఘొల్లుమన్నారు. ఏమిటా అని చూసే ఎల్లా మునిగిందో ఆ పడవ మునిగింది. నారాయుడు ఎట్లా ఉరికాడో, ఎల్లా బారలమీద వాయువేగంతో వెళ్ళాడో యిరవైగజాలదూరంలో ఒకరితర్వాత ఒకళ్ళను నలుగురిని పట్టుకోడం, వెనకాలే వచ్చిన పడవకు అందివ్వడం చేశాడండి. ఇద్దరు మనుష్యులు స్పృహతప్పితే ఒడ్డునపడేసి పొట్టనొక్కి ఊపిరితిత్తు లాడించి వాళ్ళను బ్రతికించాడు డాక్టరుగారు వచ్చేలోపుగా.

రాజా: అప్పుడే కాదటోయి ప్రభుత్వంవారు బహుమతి యిచ్చారు?

పర: ఇస్తే, ఆ పడవవాడికి పంపించాడది. ఇంకా ఉన్నాయి వాడి వీరకృత్యాలు.

నళిని: మరి కానీండి!