పుట:Narayana Rao Novel.djvu/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
272
నా రా య ణ రా వు

పర: అవళదా! నల్ల సొల్లారుదా మీరు.

నళినీదేవి: ఏమండీ! ఆయన హృదయం రాయివంటిదని చూపించండి.

రాజా: మావాడు నారాయణరావుకు బాస్వెల్ లెండి.

పర: ఆ విధంగా కూడా కీర్తికాంత వరిస్తుంది. కాదటోయి డాక్టరూ?

రాజా: తప్పక.

నళిని: చెప్పండి కవిగారూ!

సరళ: మధ్య మధ్య చిత్రలేఖన కూడా చెప్పండి.

నట: వహ్వా!

పర: మేము మొన్న యాత్రలు చేసినపుడు రైలుక్రిందబడిన ఒక బొంబాయి ఉద్యోగస్తుణ్ణి రక్షించాడు నారాయణం.

నళిని: ఏవిటదీ?

పర: వినవమ్మా చిట్టిచెల్లి! కంగారు పెట్టక ఊకొట్టు. నారాయణరా వంత పెద్దకథానాయకుణ్ణి కాకపోయినా నేనూ కథలు రాస్తూవున్నా.

నళిని: ఊ.

నట: అచ్చా!

పర: మన్మాడుస్టేషనులో ఆ రోజున వందలకొలది జనం ఉన్నారు బొంబాయి మెయిలు కోసం.

నళిని: ఊ.

పర: (చిరునవ్వు నవ్వుచు) అల్లరి అమ్మాయీ! మేము నాసిక వెడుతున్నాము. ఇంతలో రైలు వచ్చింది. ఇంకా పూర్తిగా ఆగలేదు. వేగంగా ఉన్నది. మనబొంబాయి పెద్దమనిషి ఒక్క గంతువేసి బండి పట్టుకొనబోయినాడు. పట్టుతప్పి రైలుకూ, ఫ్లాట్‌ఫారం అరుగికీ మధ్య పడ్డాడు.

నళిని: రామ రామా! ఊ! తర్వాత.

పర: కాస్తయితే నలిగిపోవలిసిందే కాని, నారాయణరావు గబుక్కున వంగి గోడ ప్రక్కనే కదలకుండా పడుకో అని కేక పెట్టాడు. ఆ మనిషి అది వినిపించుకోకుండా రైలుక్రింద దూరిపోయాడు. ఆ దూరడంలో ఒక్క కాలు తీసుకోలేక పోయాడు. చక్రం ఆ పాదం మీదనుంచి పోయింది. పాదం పచ్చడి. రైలు వెళ్ళిపోయినది. స్పృహతప్పి ఆ మనిషి పడిపోయాడు. జనం వందలకొలది దూకి ఆ మనిషి చుట్టూ చేరారు. ఒక్కళ్ళూ సహాయానికి వంగరు.

నళిని: అబ్బా! (ఒడలు జలదరించును)

పర: నారాయుడు చటుక్కున వంగి, ఆరడుగుల పైచిలుకున మంచి లావూ, భారీవున్నవాణ్ణి చంటిపిల్లవాడిలా ఎత్తి ఒక్క గంతులో ఫ్లాటుఫారం ఎక్కాడు , గబగబ రెండవ తరగతివారి విశ్రాంతిగదిదగ్గరకు తీసుకొని