పుట:Narayana Rao Novel.djvu/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయుల ప్రాచీన నాగరికత

225

వెచ్చము చేయించినారు. తర్వాత బుద్ధునికై దేవాలయమును నిర్మించినారు. అట్టి దేవాలయములలో బుద్ధగయ యొకటి. అచ్చటను శిల్పములు తీర్చిన రాతి కంచె యున్నది. స్థూపముల జూచియే, దేవాలయము లేర్పరచినారని కొందరి మతము. కాని పరమేశ్వరుడు బుద్ధునికి బూర్వమే దేవాలయము లున్నవని వాదించును.

గయనుండి మొగలిసరాయి మీదుగా శ్రీ కాశీపట్టణము చేరినారు. గంగానదిలో స్నానమాచరించి, విశ్వేశ్వరుని, బిందుమాధవుని, ఢుండిగణేశ్వరుని, యన్నపూర్ణ విశాలాక్షిని, గవ్వలక్కను, వారణనదిని, ఆసినదిని దర్శించి కేదార ఘట్టములో శ్రీ విజయనగరం మహారాజావారి భవనములో బసజేసినారు. స్నేహితులిరువురు కాశీ విశ్వవిద్యాలయము దర్శించినారు. ‘ఒక్క మహానుభావుడు బిచ్చగాడయి కోటులు సముపార్జించి యీ మహోత్కృష్టమైన విద్యాలయం కట్టించినాడు; పవిత్రుడు మదనమోహనుడు. ఈ విద్యాలయానికి బిసెంటమ్మ అసలు పునాది వేసింది. అహో! ఏమి చిత్రంరా మానవుని ప్రకృతి!’ యనినాడు పరమేశ్వరుడు.

‘ఈ మహాక్షేత్రము ఎన్నివేల సంవత్సరాల నుండి సర్వమానవలోకాన్ని పవిత్రం జేస్తోందీ! శ్రీ రామచంద్రుడీ పుణ్యక్షేత్రాన్ని దర్శించినాడా! ఒరే పరమేశా! మన దేశంలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలు తర్వాత తర్వాత వచ్చినవేమో కాని ఈ మహాక్షేత్రంమాత్రం మహాపురాతనంరా!’ అని అనినాడు నారాయణరావు.

భారతీయుల ప్రాచీన నాగరికత


‘ఈ విద్యాలయానికి లక్షలు ఖరీదుచేసే యీ భవనాలు ఎందుకు నిర్మించాడో పూర్వ సంపద్రాయాభిమానియగు మదనమోహన పండితుడు?’

‘ఒరే నారాయణా! ఒకటిమాత్రం ఉందిరా. పాశ్చాత్యవిద్యే పరమావధి అనే ఈ రోజులలో, ప్రభుత్వమువారి కోపానికి గురికాకుండా జాతీయతను పోషించడానికి వీలైనంతవరకు పోషించే ఈ విద్యాలయం ఒకటి సృష్టించాడురా మహానుభావుడు.’

‘నువ్వు చెప్పింది నిజమే. వెనక ఆనాటి కాశీ విద్యాపీఠము, నలందా, తక్షశిల, అజంతా, నాగార్జున పర్వతము, ధాన్యకటకము, నవద్వీపము మొదలగు పరిషత్తులవంటి విద్యాపీఠాలు ప్రస్తుతం మనం పెట్టలేమురా. 1921 ఆప్రాంతాల్ని పుట్టిన గుజరాతు, కలకత్తా, ఆంధ్ర జాతీయ విద్యాలయాలు పేరుకుమాత్రం ఉన్నాయి. మహానుభావుడు శివప్రసాదగుప్తగారు నిలిపిన విద్యాలయం, గుజరాతు విద్యాపీఠంమాత్రం ఇంకా నిలిచాయి. ఎప్పుడో మళ్ళీ నిజమైన విద్యాపీఠాల దర్శనం? ఆంధ్రవిశ్వవిద్యాలయం బెజవాడ నుండి వెళ్ళి