పుట:Narayana Rao Novel.djvu/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

నా రా య ణ రా వు

కొంచెము స్థూలమైన దామె దేహము. అయినను మేలిమి బంగారు దేహము. చెల్లెలికివలె, దల్లికివలె దీర్ఘమై నొక్కులున్న జుట్టు, విశాలములగు కన్నులు, చిన్న నోరు, శకుంతలాదేవి నందకత్తియగా, నుత్తమజాతి లోలాక్షిగా జాటుచున్నవి.

ప్రక్కనున్న గదిలో బరుండి యప్పడప్పుడు వచ్చి, తలుపుకడ చెవి యొగ్గి విని మరల వెళ్ళి పరుండినది. తలుపు గొళ్ళెము తీసివచ్చినది.

తెల్లవారగనే శారద వచ్చి తన ప్రక్క పరుండుటయు, శకుంతల యులికిపడి లేచి, విద్యుద్దీపము వెలిగించి శారదను దేరిపారచూచి, యా దీపము మరల నార్పివేసి, శారదను కౌగిలించుకొని పండుకొన్నది.

రెండవనాటి రాత్రి ముచ్చటలు జరుపుటలో నారాయణరా వత్యంతోత్సాహము సూపినాడు. శారద మామూలుగ నొకరీతిగా నున్నది. శకుంతలాదేవి నే డంతయు జక్కపడునని యనుకొన్నది.

నారాయణరావు తనకు, దన భార్యకు జరిగిన ప్రథమదినోదంతము పరుల కెరుక పరుపకూడదనియు, పరు లూహింపనైన నూహింపకుండ చరింపవలయు ననియు సంకల్పించుకొనుటచే మరునాడు వసంతునివలె నలంకరించుకొని, మొదటి నాటికంటె మరియు నుత్సాహముగ చరింప మొదలుపెట్టెను.

శారదకుమాత్ర మిదియంతయు నాశ్చర్యము కలిగించినది.

ముచ్చట లన్నియు నైన వెనుక, ముత్తయిదువు లందరును వెళ్ళిన వెనుక శారద వెంటనే గదిలోనికి వచ్చి తలవంచుకొని, తలుపుమాటున జతికిలపడి పోయినది. నారాయణరావు తాను దెచ్చి పెట్టుకొనిన యుత్సాహమంతయు మరిగిపోవ నిరాశావశుడై మోమువాల్చి, యొక దిండులకుర్చీపై నాసీనుడయి యాలోచనాపరుడైనాడు. తన జీవితమంతయు నెడారియైపోవునని యాతనికి దోచినది.

తన నిర్మల చరిత్రమున నేమి కళంకములు రానున్నవో?

తన హృదయదేవత యనుకొన్న శారద తనకు గాకపోయినదా?

ఎట్లు? తన యింటికడ మూడు రోజులును నున్నవికదా. అవి వేగించుటెట్లు? నారాయణుడు లేచి తన్ను ముంచివేయు నిరాశామేఘములను దరిమివేసి, భార్య పడియున్న తావునకు జిరునవ్వుతో జేరబోయి ‘ఆనందమయీ అని పిలవనా, లేక ముగ్ధలలనా! అని పిలవనా అని ఆలోచిస్తున్నాను. ఏమని పిలవను చెప్పు శారదా?’ యని ప్రశ్నించినాడు.

శారద ముకుళించుకొనిపోయినది.

‘మన జన్మం ఇలా వృథా అయిపోవాలనా నీ ఉద్దేశం? అయితే సరే. నాకు ఇతరుల మనస్సులు కష్టపెట్టడం గిట్టదు. అది నా చేతకాదు. ఈలాంటి అందకత్తె నా భార్య అవుతుంది. ఆమెకు చదువు సంగీతం దివ్యంగా వస్తాయి. శ్రీవిష్ణువులా హృదయంలో ధరించుకొంటాను, శివునిలా అర్ధనారీశ్వరుణ్ణి అవు