పుట:Narayana Rao Novel.djvu/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా మీ ద ప్రేమ లే దా ?

213


శకుంతలాదేవి చెల్లెలి హృదయమును మార్చబూని యామెకు బుద్ధులు గరపుటకు యీవలకు దీసికొని వచ్చినప్పుడు చెల్లెలితో ‘శారదా! అదేమిటి అల్లావున్నావు?’ అని పల్కరించినది. శారద మాట్లాడినదికాదు. ‘తల్లీ, నీభర్త చాలామంచివాడమ్మా. అతనంతసరదాగా అత్తరూ అదీ పూస్తూ ఉంటే పెంకిదానిలా మూతిముడుచుకొని కూచుంటారటే! తప్పుకాదూ! అల్లాంటిభర్తే నాకు దొరికిఉంటే ఈ జన్మలో నాకింకేమికావాలి? నీ అంత అదృష్టవంతురాలు లేదు. మగవాళ్ళ మనసు చాలా సున్నితం సుమీ! నువ్వు పెంకిచేష్టలు చేసేవు! జాగ్రత్త! ప్రేమతో నీ చుట్టూ కోటకట్టగల శక్తిగల వాడు. ఎంత అందమయినవాడు. ఎంత తెలివైనవాడు. చచ్చు జమీందారి సంబంధాలు మహామంచివి అనుకున్నావు కాబోలు. నాబాధలు చెవులారా వినటం లేదూ నువ్వు, శారదా!’ శకుంతల యామె చెవులో నెన్నేని చెప్పినది. శారద రోషమున ‘ఇదివరదాకా నువ్వుకూడా వాళ్ళను నానామాటలు అన లేదూ’ అని వెక్కి వెక్కి యేడువదొడంగినది. అంతలో శారద మేనత్త యటకు వచ్చినది.

శారద లోనికి వెళ్ళనని పట్టుపట్టినది. జమీందారిణి కొమరితకు భర్తపై నయిష్టమని తెలిసి సంతోషించినది. కాని గర్భాదానమునాటిరాత్రి కొమార్తె గదిలోనికి వెళ్ళదనుట నలుగురుకు దెలిసినచో నేమనుకొందురో యని భయపడి ‘లోపలికి వెళ్ళు తల్లీ’ యనిమాత్ర మన్నది.

మేనత్తయు నక్కగారును రెండుగంటలు బతిమాలి, కోపపడి, వాదింపనప్పటి కాబాల విధిలేక హృదయ ముచ్చిపోవునట్లు వెక్కి వెక్కి యేడ్చుచు లోనికిబోవ సంసిద్ధయైనది. ముద్దులకూతును గాంచి జమీందారిణియు గండ్ల నీరుక్రుక్కుకొనుచు, బిడ్డను కవుగిలించుకొనెను. శకుంతల ఆడుపులియై, కోపమున కన్నులు కెంపెక్క ‘అమ్మా! నీకేమైన మతిపోయినదటే? ముత్తయిదువు లంతా వెళ్ళిపోయి రెండున్నరగంటలు కావచ్చినది. తెల్లవారబోతోంది’ యని కేకలువేసినది.

‘ఏమి కామేశ్వరమ్మా! బాగావుంది. నేర్పుతున్నావు కూతురుకు బుద్ధులు. చాలుచాలు. ఎవరన్నా వింటే నవ్వుతారు. తమ్ముడికి తెలిసిందంటే మన గౌరవాలు దక్కవు. ఇల్లాంటివి ఎక్కడా వినలేదు, చూళ్ళేదు. శారదా! ఇల్లారా’ యని యా బాలికచుట్టు చేయిచుట్టి తలుపు తెరచినది. శకుంతల యొకవైపు ‘ఊరుకో అమ్మా, అతను చూస్తాడు’ అని చెవిలోనూది లోనికి ప్రవేశింపజేసినది. అప్పుడు వారిరువురు తలుపులు మూసి బైట గొళ్ళెము పెట్టినారు.

చెల్లెలి విపరీతావస్థకు బెంగగొనియున్న శకుంతలాదేవి కా రాత్రి యంతయు నిదురపట్టలేదు.

శకుంతలాదేవికి నిరువదియొకటవ సంవత్సరము. ఇరువురు బిడ్డల తల్లి. ఆమె శారదవలె నందకత్తియ. కాని రెండు కాన్పు లైన వెనుక బొద్దయి,