పుట:Narayana Rao Novel.djvu/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా కు ప్రే మ లే దు

215

తాను, బ్రహ్మలా నా వాక్కులో ధరిస్తాను అని కలలుకన్నా. నా కలలే రూపం పొందినట్లుగా నువ్వు నాకు హృదయేశ్వరివి అవడం నా జన్మం పావనం అయిందనుకున్నా! నవ్వితే నక్షత్రాలు నర్తిస్తాయి అని వర్ణించుకున్న బాలికవునువ్వు. నువ్వు వీణా, నేను ఫిడేలు వాయించుకొంటూ కిన్నర మిథునంలా ఉందామనుకున్నాను. ప్రతిపరీక్షలోనూ ప్రథముడుగా నెగ్గుతూ, అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించుకొన్నందుకు అనురూపయైన విద్యావతివి నాకు లభించావని మురిసిపోయాను.

‘నాకు అలవడిన కవిత్వం, చిత్రలేఖనం నీవల్ల చరితార్థమవుత వనుకొన్నా. నా రాణిని నానా భాషల్లో పాడుకొందామనీ, నా దేవిని నానా వర్ణాల, నానాభంగుల చిత్రించుకొందామనీ, నా ఆత్మేశ్వరితో నానాపరమార్థ ప్రణయలీలల దివ్యుణ్ణౌదామనీ పొంగిపోయాను. జన్మజన్మాలకూ నన్ను ప్రేమించడానికి, నీకు తక్కువైన ప్రేమను కూడా సర్దడానికి తగినంత ప్రేమ నాలో కట్టలు తెంచుకొని పొర్లుతూంది. ఈ ప్రవాహంలో నిన్ను తేల్చి వేస్తాను. క్రమంగా నా దాన్ని చేసుకుంటాను. దివ్య ప్రేయసివి నువ్వల్లా కొంచెం సుముఖంగా ఉండు. ఉపేక్షతోనైనా సరే నా ఆరాధనను అంగీకరించు. అంతేకాని నువ్వింతటి వైముఖ్యం తాల్చి మన యిద్దరి బ్రతుకులు మరు భూముల్లో ఇంకి నశించే మహానదిలా చేయకు.’

నాకు ప్రేమ లేదు

భర్త ప్రేమతో దివ్యశాంతమూర్తియై తన్నట్లు నిర్దేశించి చెప్పినంత కాలము శారద మాట్లాడలేదు. ఒకసారి రెండుసారులు భర్త చెప్పినమాటలు నచ్చి కొంచెము మెత్తపడినది. కాని జగన్మోహనునిమాటి లామె కాసమయమున నే స్పష్టముగా బొడగట్టినవి. ‘ప్రేమలేని మనుష్యుని ముట్టుకొనుట కూడా తప్పుసుమా శారదా!’ యని యాతడు పదేపదే యన్నముక్క పిడుగు వలె జెవిలో వినబడినది.

నారాయణరావు స్త్రీలతో నొకవిధమున చనువుగా నుండును. నే డెటుల శారదతో మాట్లాడగలిగెనో యతనికే తెలియదు. మరల నాతని నోట మాట రాలేదు. ఉస్సురని వెడలిపోవజూచుచు ‘మాట్లాడవేమి శారదా!’ యని జాలిగ ప్రశ్నించెను.

శారద భయమునిండిన హృదయముతో నిజముచెప్పిన ఈయన వదలు నను ఆశతో కంపితస్వరమున ‘నాకు ప్రేమ లేదు’ అని గబుక్కున కన్నుల నీరునిండ వేడ్చినది.

నారాయణరావును కొరడాతో మొగమున గొట్టినట్లయి చివుక్కున వెనుకకు జరిగి మెదడు రక్తహీనమైపోవ తూలి, లేచి, అచ్చటనుండి వచ్చి వచ్చి,