పుట:Narayana Rao Novel.djvu/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తా త ము చ్చ టు లు

185


నారా: అయితే మా అంత అప్రాచ్యులు పుట్టడానికి కారణం మీ కర్మా, మా కర్మా?

రాధా: మీదీ మాదీ కూడా రా.

నారా: మీదే అందాము. అలా అయితే మాతప్పు కాదుకదా? మా భక్తి రాహిత్యానికి కారణము మీరు కాబట్టి, మేము చేసేది ఏమీ లేదు. ఇక మేమే కారణము అందాము. అయితే ఎప్పుడో ఒకప్పుడు దీనికి కారణమైన దుష్కర్మ చేసివుండాలిగదా! ఆ! అప్పుడు భగవంతునిమీద భక్తి లేని వాళ్లున్నారన్న మాటేగా? అప్పుడే ఉంటే ఇప్పు డుండడంలో ఆశ్చర్యము ఏమీ లేదన్నమాట.

రాధా: ఆ! తెలివైనఘటమేరా నీ కొడుకు, సుబ్బారాయుడూ!

ఆ సాయంకాల మంతయు నారాయణరావుకు తాత గారు చెప్పిన సంగతియే జ్ఞప్తికి వచ్చినది. తానుగూడ రాముడు దేవుడు కాడని వాదించిన రోజులు జ్ఞప్తికి వచ్చినది. తాను ఇంగరుసాలు వ్రాసిన గ్రంథములు చదివి నిజమని నమ్మిన వత్సరము లెన్నియో! ఈనాటి యువకులు భక్తిరహితులైనారు. తాను దేశములు తిరిగినప్పుడు గుడులలో భక్త్యావేశము కలిగెడిది. తన స్నేహితు లనేకులు పూజ సేయించు టననేమో యెరుంగరు.

భక్తి యెందుకు? మోక్షముకొఱకా? మోక్షమననేమి? యని వాదించువాండ్రు. మోక్షము భగవంతునితో నైక్యమందుటా? మోక్షము లేనిచో నష్టమేమి? పుట్టుచు గిట్టుచునుందుము. పుట్టుచు గిట్టుచు ననంతమువరకు భగవంతునికి దూరులమై సైతానులవలె నున్న మాత్రమున భయమేమి? అని వారడుగుదు రనుకొందము. భగవంతుడన నేమిటి ? భగవంతుడొక వ్యక్తి యందురా? ఆ భగవంతు నెవరు పుట్టించిరి? కాదు నామము, రూపము, మొదలు, చివర లేని__ నేతి, నేతి నేతి యనజెల్లు నొకానొకటి యని యందురా? అదికాదన్న నేమి నష్టము? అని నారాయణరావు హోరాహోరి వాదించువాడు. నే డాసంగతు లన్నియు మనస్సునకు దట్టినవి.

ఈ బ్రహ్మాండములో ననంతవిశ్వములో నొక సౌరకుటుంబములో నొక చిన్న భూగోళములో నొక చిన్న పురుగువంటి తాను భగవంతుడనుట నిజమా? ‘శివోహం’ అని తెలిసికొనుటయే శుద్ధ మోక్షమా? నేను బ్రహ్మమునైన, సమస్తము బ్రహ్మము. కాని ఒక చక్రవర్తి నిద్రబోవుచున్నంత కాలము తాను చక్రవర్తి నను జ్ఞానములేక, తానేమియో తెలియక మైమరచియుండి మేల్కొనుట తోడనే దాను చక్రవర్తినను జ్ఞానమును బొందునట్లు, నీ బ్రహ్మము తన్ను తానెరుగునా? ఆత్మజ్ఞాన పరిపక్వముచే ఈ గ్రంథములన్నియు జదువుచున్న కొలది నేమో తెలిసినట్లుండును. ఏమి తెలిసినది? మనకు తెలిసినట్లున్న దంతయు మాయకావచ్చును. నిజము గోచరించుట యుత్తమపురుషునకే