పుట:Narayana Rao Novel.djvu/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

నా రా య ణ రా వు

కాబోలు. ఆస్థితి, తనకీజన్మములో నున్నదో లేదో? తన కొక్క వాసనయు వీడిపోలేదే. శారద తనకుగావలె. తన బందుగులు, తన యాస్తి, తన మిత్రులు తన చదువు, తన! తన! తన!


౨౧ ( 21 )

ఆడవాళ్ళ బ్రతుకు అథోగతి బ్రతుకు

మరునాడు సుబ్బారాయుడుగారి రెండవ కొమరితకడనుండి యుత్తరము వచ్చినది. సత్యవతి యిరువదియారేళ్ళ స్త్రీరత్నము. తీర్చిన కనుముక్కుతీరు కలిగి జామపండు చాయతో సుందరియని చెప్పతగిన వనిత. కాని బెంగచే కృశించి శలాకవలె నైపోయినది. భర్త రంపపుగోత, ప్రథమసంతానమగు నొక బాలిక తప్ప తక్కిన పిల్లలందరు పోయినారు. ఇప్పుడు మరల నెలతప్పి మూడు నెలలయినది.

వీరభద్రరావు కెప్పుడు ననుమానమే. ఛాందస బ్రాహ్మణుడు, కఠిన హృదయుడు. చిన్నతనమున నెంత సంతోషజీవియో, నేడంత పరమకోపియై నిప్పులు గ్రక్కుచుండును. అతని తల్లికిగూడ కుమారుడన్న భయము. చేయు నుద్యోగము పెద్దాపురమున డిప్యూటీకలెక్టరు కచ్చేరీలో రెండవగుమాస్తా పని. యేబదిరూపాయల జీతము ఖాయము. ఎనభై తాత్కాలికపు జీతము.

రివిన్యూపనిలో మంచి తెలివితేటలుగలవాడు. ఇంటిదగ్గర నెంతపులియో, కచ్చేరిలో అంతపిల్లి. పైఅధికారులన్న గజగజలాడుచుండును. వారి మెప్పును బొంది ప్రాపకము సంపాదించుకొనుచుండును. గ్రామాధికారులపై తోడేలువలె పడును. తనదగ్గరకు బనియుండివచ్చిన వారు పెద్దవారైనచో నిమిషమున వారిపని చేసి పంపును. చిన్నవారైన కస్సుమనును, బుస్సుమనును. అట్టిచో నెవరైనా దిరుగబడి ‘ఏమిటయ్యా! ఇదిగో వీళ్ళందరిని సాక్ష్యం వేసి పెద్ద కలెక్టరుకు పిటిషను పెట్టి డిప్యూటీకలెక్టరుగారికి ఇప్పుడే ఆర్జీ దాఖలుచేస్తాను ఉండు’ అని యనెనా తక్షణమే వీరభద్రుడు చిరునవ్వునవ్వి ‘ఏందుకు లేకోపం’ విసిగిస్తే అన్నాను. ఇదుగో చూశావూ, అబ్బాయి! పొద్దున్నుంచీ పని చేస్తూ ఉంటా. చూశావూ! అలాంటప్పుడు కాస్త కోపమూ వస్తుంది. చూశావూ, తొందర పడకు, ఏమిటీ నీపని?’ యని మేకపిల్లయైపోవును.

మంచి ఆస్తిగల కుటుంబము, గౌరవమైన కుటుంబమని యీయ, నిట్లు కొమార్తె యగచాట్లుబడుచున్నదిగదా యని సుబ్బారాయుడుగారి మనస్సు కలత నొందుచుండును.

సత్యవతి నారాయణరావు తోబుట్టువులలో నెల్ల నందగత్తెయని యెన్న దగిన పూబోడి ఆమె. కన్నులు పరమకరుణాపూరితములై, శిశునిర్మలత్వమును గోచరింపజేయును. ఆమె లేడివలె సాధుహృదయ, సాధ్వి, పతిభక్తి పరాయణ, ఆ బాల తెలివియైనది. ఏ మానిసియైన యట్టిభార్య రావలయునని తప మొన