పుట:Narayana Rao Novel.djvu/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
159
శ్యా మ సుం ద రీ దే వి

కదలికతో, కారు బొంయి, బొంయి మనుచు పున్నేమలై రోడ్డు, ఎగ్మోరు, హారిస్ వంతెన, రౌండుఠానా, మౌంటురోడ్డు, తిరువల్లిక్కేణి పోయి యచ్చట అక్బరుసాహెబు వీథిలో నొక చిన్న మేడకడ నాగినది.

అరవస్నేహితుడు: నారాయణ్! వీళ్ళు ఇక్కడనుంచి ఇంకోచోటి కిదా మార్తురు. ఈ మేడ ఒక మోస్తరుగా ఉండును.

నారా: అవును. ఈ ప్రాంతాలు అంత ఆరోగ్యంగా ఉండవు. వీళ్ళేమన్నా డబ్బుగలవాళ్ళేనా?

అర: అంత పరవాలేదు. తండ్రి జిల్లా ముఖ్య వైద్యుడుగా ఉద్యోగం చేసి పింఛను తీసిదా చచ్చిపోయినాడు. ఇప్పుడు తల్లి, నలుగురు కూతుళ్ళు, నలుగురు కొడుకులు. ఏభైవేలు మణీ యిచ్చిపోయినాడు తండ్రి.

నారా: వీళ్లు సరీగా మంగుళూరు దేశస్థులేనా?

అర: వీళ్లు తెలుగు మైసూరు కలియక. అందరికీ ఇంగ్లీషు, తెలుగు అన్ని భాషలు వచ్చునుదా. మంగుళూరు తల్లి గారిది. తండ్రి మైసూరు.

ఇట్లు మాటలాడుచు మన స్నేహితు లిరువురు లోనికి బోయిరి. లోనికి బోవునప్పటికి మధ్యమందిర మంతయు కన్నుల వైకుంఠముగ నలంకరించి యున్నది. అచ్చట పేము సోఫాలపై రకరకములగు చక్కని తెరదుప్పట్లు పరచివున్నవి. మధ్య నొక గుండ్రని బల్లయు, బల్లమీద అల్లికరుమాలును, అందుపై చీనాబుడ్లు, అలీఘరు కూజాలు వానిలో వివిధజాతి పుష్పములు నున్నవి. అచ్చట నొక కుర్చీపై మేలు పసిడిపచ్చని పదునెనిమిదేండ్ల యీడు బాలకుం డాసీనుడై యుండెను. వీరిరువురును వచ్చుటతోడనే ఆ బాలకుడు లేచి ‘నటరాజన్! వచ్చినారా?’ అని ఇంగ్లీషున ప్రశ్నించుచు దయచేయండి యనెను.

నట: ఈయన మా తెలుగు స్నేహితుడు నారాయణరావుగారు. ఫిడేలులో నిధి. నారాయణరావు! ఈ బాలకుడు మంగేశ్వరరావుదా. ఇక్కడే బి.ఎ. జూనియరుదా చదువుచున్నారు.

నారాయణరావు మంగేశ్వరరావులు హస్తస్పర్శ గావించుకొనిరి.

మంగే: నేను లోనికి బోయి మా యక్కగార్లను చెల్లెళ్లను బిలుచుకు వచ్చెదను. ఇచ్చట గూర్చుండుడు.

అని యాతడు లోనికిబోయెను. నారాయణరావు చదువుకున్న బాలికల సమీపించి వారితో మాట్లాడుట కిదే ప్రథమము. స్త్రీలు విద్యాధికులగుట, నారాయణరావుకున్న ఉత్కృష్టాశయములలో నొకటి. స్త్రీ విద్య జాతీయముగా నుండవలయును. లేనిచో పాశ్చాత్య విద్య నయమేమోకాని, ఏవిద్యయు లేక మూర్ఖత లోనుంచుట మంచిదికాదని యాత డూహించినాడు. ‘విద్యలేకుండా స్వచ్ఛహృదయులై యుండినచో స్వరాజ్య పవిత్రముహూర్తము