పుట:Narayana Rao Novel.djvu/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొ లం

139

“యెంకటదాసు ‘ఏటినాతలి! నీకు బయం లేదులే!’ అంటూ గువ్వపచ్చిలా ఒణికిపోయే పిల్లను అదిమిపట్టుకొని, సల్లసల్ల కబురులు సెపుతూ ఇంటి తలుపు యెయ్యబోతూ ఉంటే మరకడుగాడు తలుపు తోసేస్కోని లోపలపడ్డాడు. ఆడు దెయ్యంపట్టిన రాక్షసిలా ఉన్నాడు. అయ్యను సూసి ఆగిపొయ్యేడు. ఆడిసేగితులంతా గుమ్మందగ్గర నిలబడ్డారంటఱ్ఱా!”

‘ఆఁ...!’

‘ఓ రప్ప డెంకటదాసు రామా! రామా! అంటూ ‘ఓరి యెదవన్నా రాచ్చసీ, ఇంటిలోకి వచ్చావుంటే నీ పాణం పోతాది. నీ సేటుకాలం నీకింత తెస్తాఉంది. నా కడుపుకు సెడపుట్టినావురా! నాబగితికి యేరుపురుగువురా!’ అంటూ రెండు సేతులూ సాసి మరకడి కడ్డంగా నిలబడిపోయాడు.’

‘ఊఁ...!’

‘తండ్రనిలేదు, దైభమని లేదు, బయమని లేదు, బగితని లేదు; తండ్రిని తప్పించుకొని, గజగజలాడిపోతూ మూలనుంచోని ఉన్న నీలాలుమీద పడ్డాడు. తండ్రి లాగబొయ్యాడు, తప్పించ పొయ్యాడు; తండ్రిని ఒక తోపుతో మూలకు పడేసేప్పటికి యెంకటదాసు గోనెబస్తాలాగు కూలబడిపోయినా డంట్రా!.’

‘ఆఁ...!’

‘మరకడు పిశాచంలా అయిపొయ్యాడు. నీలాలుదాని కోక యిప్పి పారేసి మూలకిసిరాడు. తళతళ లాడిపోయే దానివళ్ళు ముడుసుకుపోయింది. ఒరే మరకడు పందయ్యాడు, యాగ్రము అయ్యాడు, అడవిదున్నపోతు అయిపోయాడు. తనబట్ట యిప్పిపారేసికొన్నాడు. తండ్రి సూత్తున్నాడని లేకుండా, రాక్షసిముండకొడుకుల్లాంటి సేగితులు సూత్తున్నారని లేకుండా ఆ సిన్నదాన్ని కింద పండబారేసి మీదడిపొయ్యాడు...’

‘ఊఁ...!’

‘మూల సినిగిపోయిన గుడ్డలా, సీపురుగట్టలాపడి ‘రామా! రామా! రామా! రామా! మహప్పెబూ రచ్చించు, రచ్చించు’ ఆంటూ కళ్ళుమూసుకొని ఉన్న యెంకటదాసు కళ్లు తెరిసి చూసినాడు మరకడు దానిమీదడ్డము, ఆ పిల్ల సాయాశక్తులా ‘ఓరిబాబో! యెంకడదాసూ! తండీ రచ్చించో!’ అంటు ఆడికిలొంగకుండా తిరిగిపోడమున్నూ.’

‘ఊఁ...!’

‘హుమ్మని ఉగ్రుడై లేచాడురా యెంకటదాసు! ఆడికి యెయ్యి యేనుగుల బలము వొచ్చినట్లయిందిరా! అమ్మవోరి జాతరకు యేటపోతుల్ని తెగేసే యేటకత్తి గోడమీదెట్టిందాన్ని తీశాడు. ‘అల్లల్లాభైరాహూం! ఆకాశ భైరాహుం అలలలలా! లలా! లలా!” ఆంటూ కత్తి మూడుసార్లుతిప్పి ఒక్క యేటుతో కొడుకు తలకాయ యేట యేసేసరికి తాటి సెట్టుమీంచి పండ