పుట:Narayana Rao Novel.djvu/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
138
నా రా య ణ రా వు

అని అనుకున్నాడు. నీలాలు పిల్లదాని బాబుకి మాయిడిపళ్లు, సెకరకేళీలు, సీరలు, రైకలు పంపించేవోడు. నీలాలుతండ్రి అవన్నీ పట్టుకుపోయి కోపంతో ఆళ్లింటిలోనే పారేసి, యెంకటదాసుతో ‘నీ కొడుకు సేసే దురన్యాయాలుకి మితుండటంలేదు. ఆడికి నువ్వు బుద్ది సెప్పుకుంటే మాం అంతా సంతోషిస్తాము’ అన్నాడు...!’

‘ఊఁ ... !’

‘ఓరోజున మరకడు, సెరువుకు నీరుకోసం ఒంటిగా ఎడుతూన్న ఆ సక్కనిపిల్ల నీలాలుదానిసూసి ‘ఒలే నీకంటిమిద నామణసు, నీ వొంటిమీద నా సూపు, నీ సేతులు, నీ నడుము, నీ అందం నన్ను నీ కుక్కను సేసినై. నువ్వూ నేనూ మారుమనువు సేసుకొందం, నీ మొగుణ్ణి తోలెయ్యే. ఆడికి ఎంత సొమ్మయినా తప్పు ఇచ్చేస్కుంటాను, నేనంతగా దేన్నీ బతిమాలలేదే. నీకు దాసుణ్ణి. నీ ముందర నా బలం అంతా నీరయిపోయింది. నన్ను రచ్చించుకో’ అని దణ్ణం బెట్టాడు. నీలాలు బయపడి గజగజ లాడిపొయ్యింది. ‘ఓరన్నా, నీ తోడుబుట్టిందాన్ని, నాయనా నువ్వల్లా అనవచ్చునంటరా ’ అన్నాదుండి.’

‘ఈలా ఒక సారికి రెండుసార్లు, మూడుసార్లు దాన్ని రెట్టించినాడంటా... లొట్టలేసినాడంట సివాల్న సీరకొంగు యిసిరిపట్టి సేయిపట్టుకొన్నాడంట.’

‘ఆ ... !’

‘సెయ్యి యిదిలించుకోని సెలపెయ్యలాగా పోతూన్న నీలాల్ని, యిడిపొయ్యేదాని కొప్పుసూసి ఒళ్ళు బిగి వొదిలేసినాడు. ‘ఇది మామూలుగా లొంగదు, దీన్ని బలవొంతం సెయ్యాల్సినదే. మామూలుగా లొంగేది కాదురా మా గెట్టి మణసు. దీని పొంకవైన ఒళ్ళు నా ఒళ్లు నొక్కేస్కోవాల; దీన్ని ముద్దెట్టుకున్న వోడిజల్మమే జల్మం’ అనుకున్నాట్ట.’

‘ఆఁ ... !’

‘ఆరి! ఓ రోజు సీకటడేయాల కుప్ప నూరుస్తుండే అయ్యకి కూడిచ్చేందుకు ఒంటిగా పొలం ఎల్లే నీలాల్ని సూశాడు. ఆడివొళ్లుప్పొంగిపోయింది. ఆడి కళ్ళెఱ్ఱబడినై. ఆడి గుండె జల్లుమందిరా నాయనా, పుంత దారిలో బైరాగుల సింతకాడ, ఆడు తన జట్టుతో దాంకోని ఉన్నాడు. దారికడ్డంగా నిలుస్సొని ‘ఓసీ! నాదాన! నీ కన్నులు కరిగిపోను, నీ గుండె మరిగిపోను, నా సేతుల్లోకి రాయే!’ అంటూ దానిమీదపడ్డాడు. ఆ సిన్నది లేడిలా ఒణికిపోయింది, బతిమాలింది, బయ మెట్టినాది. ఎలా తప్పించుకొందో, ‘ఓలమ్మో, ఓలిబాబో, రచ్చించండో అన్నల్లారా!’ అంటూ ఒకటే పరుగు, ముందు నీలాలు యెనక మరకడు ఆడి సేగితులు! మరీ యెల్లావచ్చిందో యెంకటదాసింటిలోకి వచ్చిపడ్డాదంటరా.’

‘ఆఁ ... !’