పుట:Narayana Rao Novel.djvu/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

నా రా య ణ రా వు

డ్డట్టూ, తలకాయ మూల్నబడింది. మొండెము గిజగిజ కొట్టుకుంది. ‘హుమ్ము! అలా! అలా!’ అంటూ యెంకటదాసు ఆ రగతము ఒళ్లంతా రాసుకోనీ ‘నేను బైరవుణ్ణీ! నేను ఆంజనేయుణ్ణి! హుం!’ అంటూ యీదిని బడ్డాడు. యొక్కళ్ళేని బలము, యెక్కళ్ళేని శగితి, పెద్దపులిలా, మరకడిగాడి సేగితుల్ని యెంటాడించి, దపా, తపా, ధం అంటూ పారిపొయ్యేవోళ్లని తరిమీ, తరిమీ యిద్దర్ని సంపేసినాడు. తక్కినాళ్లు ‘ఓలమ్మో ఓఓ’ అంటూ తలో దారిమీదా పారిపొయ్యేరు.’

‘ఊఁ...!’

‘ఆ ఉగ్గరం తగ్గలేదు. పెజలు యేనకుయేలు మూగారు. పొగలేశారు, కొబ్బరికాయలు కొట్టినోరు, కోళ్లనుజంపినోర్లు, రగతం మొగం మీద జల్లినోళ్ళు. అప్పుడు యెంకటదాసుకు పూనిన యీరబద్దుడు చల్లారాడు. అప్పుడు యెంకటదాసుకు మెలకూ వచ్చింది. కొడుకుని, ఆడి సేగితుల్ని సంపినానని తెలుసుకొని యెంకటదాసు ‘శీ రామా సీతారామా నీ కరుణా!’ అంటు మంచమెక్కి రెండు రోజుల్లో ఆ భగవంతుడిలో ఐక్యమైపొయ్యాడు. నీలాలు మరకడెప్పుడు తన సీరిప్పేసి నాడో అప్పుడే మూరసపోయింది. ఆ మూరసలోంచి తెలివిరాలేదు, పేణం పోయిందిరా.’

‘ఆఁ...!’

‘ఓరి నీలాలు పాణం ఒదిలేసింది అని నీలాలు తండ్రికి తెలిసిందోలేదో ఆడుకత్తిపుచ్చుకొని బయలుదేరి, దారికాసి పుంతకాసి మరకడు సేగితుల్ని యావన్మందిని సంపేసి తాను నదిలోపడి నీళ్ళలో కలసిపోయినాడురా!!

‘ఆఁ...!’

౧౦(10)

పాలేర్లు

శంనోమిత్రః శంవరుణః శంనోభవత్వర్యమా

శంనఇంద్రో బృహస్పతిః శంనో విష్ణురురుక్రమః

భరత ఖండము పంటభూమి. చరిత్రయను మాయాపటమును తొలగించి చూడగలిగితిమేని యీగడ్డపై బుట్టిన ప్రజలు తొలినాళ్ళనుండియు కర్షక వృత్తినే ప్రధానముగ నమ్మియున్నారని తేట తెల్లము కాకమానదని సుబ్బారాయుడుగా రాలోచించుచు కూర్చుండినారు. ‘ఓ వరుణదేవుడా! మా నాగేటిచాళ్ళను మేఘములను గొనివచ్చి తడుపుమా. ఓ ఇంద్రుడా! నీ సప్తవర్ణముల ధనువు మా మనముల కానంద మొనరింపుచుండ, మా పొలములను ఫలవంతము చేయుము’ అను ఆర్యఋషుల సూక్తము లాయన హృదయమున ప్రతిధ్వనించినవి.