పుట:Narasabhupaleeyamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసభూపాలీయము. ఆ. 3.

47


దని సతి దెల్పినం దెలియఁ డౌర నిషాదులఁ జాపహస్తులం
గని విపినేభపంక్తిఁ గని క్రమ్మఱ నాజియకాఁ దలంచుచున్.

18

జుగుప్స —

క.

పలలాస్థిశోణితాదులఁ, బలమాఱును జూడ నరుచిభావము లోనం
దళుకొత్తు నిగర్హణ మది, తలపోయ జుగుప్స యనఁగఁ దగు నెట్లన్నన్.

19


చ.

తలలు సరోజము ల్మెదడు తండము క్రొన్నురు వెంత్రజాలముల్
జలఫణు లస్థిఖండములు శంఖము లై తగు నెత్రుటేర్లలోఁ
గలభికపాలనౌచయము గ్రక్కున నెక్కి చరించు సంగర
స్థలుల నృసింహనిర్దళితశత్రు వసారసమస్తభూతముల్.

20

క్రోధము —

క.

అపకారకారు లగునరు, లపరాధ మొనర్ప [1]నే మహామహునిమనం
బు పరిజ్వలితం బగు నది, యపరిమితక్రోధ మయ్యె నది యె ట్లన్నన్.

21


చ.

స్థిరభుజవిక్రమక్రమనృసింహ నృసింహ భవత్కరాగ్రభీ
కరకరవాలసిద్ధుఁ డతిగాఢయశోరససిద్ధిఁ గోరి బం
ధురహయసింధురావళుల తోరణదుర్గకవర్గళోన్నతి
న్నరబలి వెట్టు దుర్మదసనాథరిపుక్షితినాథయూథమున్.

22

విస్మయము —

క.

వివిధాపూర్వము లగువ, స్తువులు గనుంగొనినయెడల సుజనునిమది[2]లో
దవిలిన [3]ప్రమోదవిస్తర, మవిరళవిస్మయ మనంగ నగు నె ట్లన్నన్.

23


చ.

ధరణి నృసింహభూవరుప్రతాపమహాతప మబ్జజాండక
ర్పరములు నిండి తీవ్రగతి బర్వ నఖర్వసగర్వవైరిభూ
వరులు వడంక సాగుదు రవార్యనవవ్యజనాతపత్రవై
ఖరులు దొలంగఁ జేయుదురు కన్నులఁ జీఁకటి కప్పుచుండఁగన్.

24

శమము —

క.

నిరుపమవైరాగ్యాదుల, కిర వై నిశ్చలత పూని హృదయము తిర మై
నరులకుఁ బరిణతిఁ జెందిన, ధరలో నది శమ మనంగఁ దగు నె ట్లన్నన్.

25


ఉ.

హోరభవాదిదుఃఖములఁ గుందఁగ నీక నృసింహుఁ డౌర దు
ర్వారఫలప్రదం బగువిరక్తిసుఖం బొనరించె నంచు నీ
వైరులు మౌను లై విపినవాటిని నీవ గురుండ వంచు నీ
పేరిటి యక్షరంబులె జపింతురు శ్రీనరసింహభూవరా.

26
  1. ఁగా
  2. కిం
  3. విస్తారంబది, య