పుట:Nanakucharitra021651mbp.pdf/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

2

నానకు చరిత్ర.

దేవి యోరిమిఁగలిగి మగనిమాట జవదాటక వానియెడ గడుభక్తిగలిగి యుండెను. తండ్రియొక్క మనోదార్ఢ్యము తల్లి యొక్క సాథుశీలము గ్రహించి యాదంపతులకే నానకు జన్మించెను.

ఆతని జన్మదినము నిర్ణయించుటకుఁ దగిన యాధారములు కానరావు. కొందఱు వాని పుట్టినదినము కార్తికశుద్ధ పూర్ణిమ యనుచున్నారు. మఱికొందఱు వైశాఖశుద్ధ తదియ యనుచున్నారు. కార్తికశుద్ధపూర్ణిమనాడు నానకు జ్ఞాపకార్థము టాలువెండి గ్రామములోఁ బ్రతిసంవత్సరము తీర్థము జరుగుచుండుటచే వాని జన్మదినము కార్తిక పూర్ణిమయేకాని వైశాఖశుద్ధతదియ కాదని నిశ్చయింపవలసియున్నది. ఆరాత్రి నిశీధసమయమున స్వధర్మభ్రష్టులగు హిందువులను మంచిదారినిం ద్రిప్పదలంచిన యామహత్ముం డవతరించెను.

మనదేశమున గొప్పవారి పుట్టుకలు సామాన్యమనుష్యుల జన్మములకంటె విలక్షణముగ వర్ణింపఁబడుచుండును. రామ, కృష్ణాది మహాత్ములు జన్మించినప్పుడు మహాద్భుతము లనేకములు జరిగినట్లు మనవారు పురాణములలో వర్ణించి యుండుటచే నిటీవలివారును మహాపురుషుల జన్మ కాలమునందు వింతలు పొడకట్టినట్లు వ్రాయఁదొడంగిరి. నానకు చరిత్రము వ్రాసినవారు గూడ నీవృద్ధాచారము నతిక్రమింపక వాని జన్మము లోకసామాన్యముగ వ్రాసిరి. నానకు పుట్టినతోడనే