పుట:Nanakucharitra021651mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నానకు చరిత్ర.

ప్రథమాధ్యాయము.

నానకు క్షత్రియ వంశస్థుఁడు. తండ్రిపేరు కాళుఁడు. తల్లి పేరు త్రిప్తాదేవి. కాళుఁడు టాలువెండి గ్రామమునకు మునసబగుటచేత మిక్కిలి పలుకుబడి గలిగి లోకవ్యవహార వేదికయై మితవ్యయముచేత ధనముకూడబెట్టి వడ్డివ్యాపారము చేయుచు గౌరవముగ గాలక్షేపము చేయుచుండెను; కాని వాని నోరు మంచిదికాదు హృదయకఠినము. జనులతోఁ గలసి మెలసి యుండుట కిష్టములేనివాఁడు. ఆశగలవాఁడు అందుచేత గ్రామవాసులు వానికిఁజంకి పైకి వానియెడ మిత్రభావముఁ జూపినను మనసులలో వానిని ద్వేషించిరి. వానిభార్య త్రిప్తాదేవి గుణములలో మగనిం బోలక భిన్నశీలము గలదై నోటిమంచితనము సాథుస్వభావము గలిగి గ్రామవాసులచే గౌరవింపబడుచు వచ్చెను. మగఁడు ధూర్తవర్తనుఁడై చీటికిమాటికి మహాకోపపరవశుఁడై తన్ను సిలుగులఁబెట్టుచు వచ్చినను త్రిప్తా