పుట:Nanakucharitra021651mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

హిందూస్థానమున వాయువ్యదిగ్భాగమందు పూర్వము నుండియు సుప్రసిద్ధమగు పాంచాల మను దేశము గలదు. అది ప్రస్తుతము పంజాబుదేశమను పేర వ్యవహరింప బడచున్నది. ఆదేశమునందు లాహోరు ముఖ్యపట్టణము. ఆ నగరమునకు సమీపమున "టాల్వెండి" యను పల్లె యొకటికలదు. నానకు "టాల్వెండి" గ్రామమందు క్రీ.శ. 1468 వ సంవత్సరమున జన్మించెను. నానకు సీకుమతమును స్థాపించిన మహాత్ముడు. జనులు సనాతనము లగు నుత్తమధర్మముల విడచి దురాచారములే సదాచారముగ భావించి భ్రష్టులగుచుండ జూచి జాలినొంది కేవల లోకోపకార పరాయణుడై నానకు పరమార్థ మెఱుగక గతాను గతిగముగ నథోగతిపాలగుచుండిన తోడిజనుల నుద్ధరించుటకు మంచిదారింజూపిన మహానుభావు డగుటచే నాతనిచరిత్రము నెల్లవారు జదువదగినదని వ్రాయబూనితిని.


ఇట్లు,

గ్రంథకర్త.