పుట:Nanakucharitra021651mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యబులారు గుఱ్ఱమెక్కి యెటునుండియో స్వగ్రామమునకు బోవుచు నానకు పండుకొనియున్న స్థలము సమీపమునుండి చనుచు నామహాద్భుతమును జూచి విస్మితుడై రెప్పవాల్పక బాలుని వానింగాచు సర్పమును జూచుచు గుఱ్ఱము నాపెను. కొంతదవ్వుననున్న పరిజను లంతలో వానింగలుసుకొనుటయు రాయబులారు వానింజూచి "యాబాలుడు మృతినొందెనా" యని యడిగెను. మృతినొందలేదని వారు బ్రత్యుత్తరము చెప్పుటయు రాయబులారు కడునచ్చెరువడి పామును వెడలగొట్టుమని వారి కానతీయ వారుమిక్కిలి మెలుకవతో బాలున కపాయము గలుగకుండ సర్పమును బెదరించి యవ్వలకుదోలి బాలునిడాసి యతడు తా మెఱిగినవాడేయగుట వానిం తమయజమానునకుదెల్పిరి. రాయబులారు వెంటనే గుఱ్ఱముడిగి బాలుని ముద్దుపెట్టుకొని యతనెవ్వడో యవతారపురుషుడని నమ్మి గ్రామమునకుబోయి తనచూచినదంతయు బూసగ్రుచ్చినట్లు కాళునితో జెప్పి బాలకుడు సామాన్య మనుష్యుడు గాడు. కావునవానియెడల నెక్కుడు దయజూపుమని బ్రతిమాలి యింటికిబోయెను. ఇట్లు రెండుమూడు సంవత్సరములు కాళుడు కుమారుని గోపాలకవృత్తియందు నిలిపి దానికతడు తగడని గ్రహించి కొడుకు చాకచక్యమునుజూపి పాటుపడదగినదియు బడిన పాటునకు లాభము గలిగించునదియు నగు వృత్తిం బ్రవేశ పెట్టదలచి యొకపొలము వానికిచ్చి యందు వ్య