పుట:Nanakucharitra021651mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

నానకు చరిత్ర.

వసాయము చేయుమని వానిని నియోగించెను. అదనునందే పొలముదున్నుట విత్తనములనాటుట మున్నగుపనులు జరిగెను. పక్షిదొంగల బారినుండియు పందులు మొదలగు జంతువులబారినుండియు జేను కాపాడుట నానకు పనియైయుండెను.

అతడును దనపొలమున వ్యర్థముగ గూర్చుండక పలు మారిట్టటుదిరుగుచు గేకలువేయుచు జప్పటులజరచుచు చేను కాచుచున్నట్లె యగుపడెను. కాని యొకనాడైన నతడు చేతులార వడిసేలత్రిప్పి యెఱుగడు మీదుమిక్కిలి ప్రక్కపొలములయందలి కాపుల పసువులు తనచేల బడినప్పుడు వానిం బారదోలుట తనకెంతో కష్టముగనుండెను. ఒక్కొక్కనాడతడు దయారసముచేత నొడలు మంచి మృగములు పక్షులు యధేచ్చముగ బండిన చేను మేయుచుండ గన్నులప్పగించి చూచుచు నూరకుండువాడు. కాళుని మనసెప్పుడును గుమారునిదెసయనుమానాస్పదమైయుండుటచే నొకనాడతడు పొలమునకుంబోయి చేను దెసజూచి యది పాడుగానుండుట గ్రహించి మితిమీరిన కోపమునంది యాబాలకుని మిక్కిలి తూలనాడి దానం దనివినొందక నింటికిబోయి తనయుండు మహైశ్వర్యవంతు డగునని జాతకమువ్రాసిన పురోహితునిమీదబడివానినెంతయు నిందించెను.

ఆపురోహితుడును శాంతముదాల్చి కాళుని కోపకారణమెఱిగి తనపలుకు లసత్యములు కావనియు నానకు సర్వ