పుట:Nanakucharitra021651mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

నానకు చరిత్ర.

మనసున సందేహములు పుట్టి వానిని బాధింపదొడగెను. ఏసందేహములు దోచిననేమి ఏయాలోచనలుతట్టిననేమి మొత్తముమీద కొడుకుచేసినపనులు తండ్రికి గిట్టవయ్యె. నానకు పసులకాపరియైయున్న కాలమున రెండు చిత్రకథలు జరిగినవట. నానకు పేరెత్తినవారందఱు తామునమ్మిన నమ్మకున్న నీయద్భుతకథలు రెండు జెప్పుకొనకమానరు. అందుమొదటి కథ యిది. నానకు మండు వేసగి నొకనాడు పగలు రెండుజాములవేళ నీచెవిగాడు పాచెవికి గొట్టుచున్నప్పు డూరబైట బసుల కాచుచుండి కునికిపాట్లురాగా నిద్దురనాపజాలక యొక చెట్టుక్రింద బండుకొనియెనట. సూర్యుడు పశ్చమమునకుబోవుచున్నకొలది చెట్లనీడలు మునుపున్న తావునుండక మారుచుండుట సహజముకదా! ప్రకృతిధర్మ మట్లున్నను నాడది యేమిచిత్రమోకాని నానకు పండుకొన్న చెట్టునీడ సూర్యగతింబట్టి మార్పు జెందక యున్నతావునేయుండి యాబాలున కెండతగులకుండ గాపాడుచుండెనట.

రెండవకథ యీవిధముగనున్నది. గ్రీష్మకాలమున మఱియొకదినమున నతడు పసులగాచుచు నిద్రాభరము నాపలేక మట్టమధ్యాహ్నము మరియొకతావున నెండలో బండుకొని గాడనిద్ర జెందెనట. అప్పుడొక నల్లత్రాచు తనపడగ బాలునితలమీద విప్పి వానికెండ సోకకుండ సంరక్షణముచేయు చుండెనట. ఆసమయముననే టాలువెండి గ్రామనివాసి రా