పుట:Nanakucharitra021651mbp.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

నానకు చరిత్ర.

వాని యసాధారణశక్తి కచ్చెరువడి తన మనంబున నప్పుడప్పుడు పొడమి తనకు దుస్సాధ్యములయిన వేదాంతవిషయిక సందేహముల దీర్చుకొనుట కదియే సమయమని యాబాలు ననేక ప్రశ్నము లడిగెనట. అడిగినతోడనే నానకు వాని కన్నిటి కవలీలగ దగునుత్తరము లిచ్చెనట. ఆయుత్తరములు సహేతుకములుగ నున్నట్టు తోచుటయు గురువు బాలుడని యెంచక భయభక్తులు మెఱయ శిష్యునిపాదములకు నమస్కరించి యతడు సామాన్యుడు గాడనియు నవతారపురుషు డనియు శ్లాఘించెనట. ప్రపంచమందు మహాద్భుతమగు బుద్ధివికాసముగల బాలురు లేరని చెప్పజాలము గాని యేడేండ్ల యీడు గల బాలకు డట్టి పరమార్థబోధకములగు పలుకులు పలికెననుట విశ్వసనీయము కాదు.

అతడు పుట్టిపెరిగిన కుటుంబము నిరంతరము వేదాంత చర్చలలో గృషిచేయుచుండిన పక్షమున బాలకున కా సంబంధములైన మాటలు కొన్నిపట్టుబడి యుండునని మన మూహింపవచ్చును. అట్టిదేదియు నిచ్చట గానరాదు లేక సహజముగ మహాబుద్ధిమంతుండగు బాలుడు గొప్పవిద్వాంసులయు విరాగులయు సహవాసము జేయుచుండిన పక్షమున నీవిధములగు పలుకులు గాకపోయినను జ్ఞానగర్భితములగు కొన్ని పలుకులు పలికినాడని మనము నమ్మవచ్చును, అది యేదియు నానకు విషయమున గానరాదు. తల్లిదండ్రులకు