పుట:Nanakucharitra021651mbp.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాంత కృషి లేదు. విరాగులతో సహవాసమున్నట్లు గనబడదు. మంచివిద్యావ్యాసంగ మదివఱకే యుండవచ్చుననుకొన్న బడికిపోయిన మరునాడే యీచిత్రకథ జరిగెనని చెప్పుచున్నారు. కావున నేవిధమున జూచినను మన మా కథ నమ్మదగినదిగ లేదు. దాని యాథార్థ్య మేమైయుండునన నానకు నోటనుండి యాపలుకులు బడికిపోయిన మరునాడే రాకపోయినను యుక్తవయస్కుడై జ్ఞానవంతుడై మతసంస్కర్తయైన పిదప వానినోటనుండి యావాగ్రత్నములు వెడలియుండవచ్చును. చరిత్రకారులు వానికి మహిమ లారూపింపందలచి పెద్దనాటి మాటలు పిన్ననాటికి మార్చి యుండవచ్చును.

అది యటుండ నీ సంభాషణములు జరిగిన పిదప నానకు మఱియెన్నడు బడికి పోయియుండలేదనియు వానిచదువు రెన్నాళ్ళతో ముగిసెననియు చరిత్రకారులు చెప్పుచున్నారు. ఇదియును వాని శిష్యులు వానియందలి భక్తివిశేషముచేత దక్కిన ప్రాకృత పురుషులవలె నతడు చిరకాలము విద్య నేర్చికొనలేదని లోకమునకు దెల్పదలచి యట్లు వ్రాసియుందురేగాని యది నిజము కాదు. ఏలనన నెట్టికుశాగ్రబుద్ధికైన జదువుకొనకయే విద్య రాదు. అభ్యసించునప్పుడు విద్య సూక్ష్మముగ గ్రహించునట్టి మనీష యుండిన నుండవచ్చు. చదువక పండితుడైన వాడెవ్వడును లేడు. మఱియు నానకు హిం