పుట:Nanakucharitra021651mbp.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

నానకు చరిత్ర.

యట్లుచేసెను. నానకు దృఢశరీరుఁడై దినదినప్రవర్థమానుడయ్యెను. ఈతని శైశవమునుగూర్చి చరిత్రకారులెవ్వరును దగినట్లు వ్రాయలేనందున వానిచిన్ననాటి లక్షణము లిట్టివనినిర్ణయింప మనశక్యముగాదు. అతఁడు బాల్యమున దోడిబాలురతోడను బాలకులతోడను గలసి మెలసి యాటపాటలలో మెలంగక తరుచుగ నితరులతో మాటాలాడ నొల్లకయుండు వాడని కొందఱువ్రాసిరి.

ఏడవసంవత్సరమందు దండ్రి వానికక్షరాభ్యాసముచేసి గురువునకు బహుమానములిచ్చి విద్యాభ్యాసము చేయింపుమని కొడుకు నప్పగించెను. హిందీభాషను వ్రాయుటచదువుట వర్తకుల కుపయోగించు లెక్కలువేయుట మాత్రమే యాగ్రామ పాఠశాలలోఁ జెప్పునట్టి విద్యలు. బడిపంతులువాని కక్షరాభ్యాసముం జేసి తన చెప్పగల విద్యలు గరపుటకు బాలకుని బడికిం దోడ్కొనిపోయెను. నానకు బడికిబోయి మొదటినాడు నెమ్మదిగ నుండెను; కాని రెండవనా డతఁడు చదువుకొనక యూరక గూర్చుండ గురువు వానిం గసిరి బెదరించెను. బెదరించుటయు శిష్యుడు గురువుపై దిరుగబడి గురువును ధిక్కరించి నాకు చెప్పుటకు నీకేమి చదువు వచ్చునని వాని నడిగెనఁట. శిష్యుని ప్రశ్నమువిని గురువు తెల్లబోయి తాను సకలశాస్త్రములు నేర్చినట్లు ప్రత్యుత్తర మిచ్చెను. ఆ మాటలు విని నానకు లౌకికవిద్య నిరుపయోగక మగుటయే