పుట:Nanakucharitra021651mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నట్లు కుమారుడఖం డైశ్వర్యవంతుడగుననియు గ్రహములన్నియు నుచ్ఛస్థానముననున్నవనియు జెప్పి యంతతో బోక బాలునకు స్వేతచ్ఛత్రాధిపత్యము గూడ గలుగునని వక్కాణించి తదనుకూలముగ జాతకమువ్రాయ తండ్రి యదిచూచి మేరమీరిన సంతోషమునందెను. పురోహితుడు జాతకము నందు బూర్వోదాహృతములగు విషయములకు దోడుగ నానకు గొప్పయవతార పురుషుడనియు వానింబోలినవారు మున్నెవ్వరులేరనియు వానిని హిందువులు మహమ్మదీయులు సమానముగ గౌరవింతురనియు బంచభూతములు వానికి లోబడియుండుననియు నతడు పరమేశ్వరారాధనమునందు నిరతుడైయుండుననియు గూడ వ్రాసెనట. ఈవిషయములు పురోహితుడు మొట్టమొదట జాతకమునందు వ్రాయుటయబద్ధము. నానకు మతసంస్కర్తయై లోకఖ్యాతుడైన పిదప వానిభక్తులు మొదలగువారు కల్పించుట నిజము. జాతకము లెట్టివో జాతకములువ్రాయు జ్యోతిష్కులెట్టివారో వారిమాట లెంతవఱకు బ్రమాణములో మనదేశస్థులు చక్కగా నెఱుగుదురు. గావున నిచ్చటవిస్తరించి వ్రాయనక్కరలేదు.

కాళుడు పురిటిదినములు గతించిన వెనుక గుమారునకు జాతకకర్మములుచేసి నానకని నామకరణముచేసెను. కాళుడు ప్రథమసంతానమైన యాడుబిడ్డకు నదివఱకె నానకియని పేరుపెట్టుటచే నామెపేరే కొడుకునకుగూడ బెట్టదలచి